Author: Shivaganesh

  • దరఖాస్తు చేసుకున్నారా..!

    కరీంనగర్: చొప్పదండి నవోదయలో వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుకు చేసుకునేందుకు ఈనెల 29 చివరి తేదీ అని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు లేదా రెసిడెంట్ సర్టిఫికెట్, ఫోటో, పేరెంటు, స్టూడెంట్ సంతకంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  • నేడు హుస్నాబాద్‌లో మోడీ కానుక కార్యక్రమం

    సిద్దిపేట: కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ప్రభుత్వ పాఠశాల 10 తరగతి విద్యార్థులకు మోడీ గిఫ్ట్‌లో భాగంగా సైకిల్ పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హుస్నాబాద్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సన్మానిస్తారని పార్టీ నాయకులు దొడ్డి శ్రీనివాస్ తెలిపారు.

  • అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు..

    వరంగల్: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి నిరుపేద ఎస్సీ విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే వారికి ఈ పథకం కింద రూ.20 లక్షల స్కాలర్షిప్ మంజూరు చేస్తారని పేర్కొన్నారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    వరంగల్: పోస్టెమెట్రిక్ స్కాలర్షిప్ (ఫ్రెష్, రెన్యూవల్)ల కోసం బీసీ, ఓబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎ.పుష్పలత ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి సెప్టెంబర్ 30 వరకు www.telanganaepass.cgg. gov.inలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు హన్మకొండ లష్కర్ బజార్ బీసీ స్టడీసర్కిల్ ఆవరణలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • కుమార్తెల పుట్టిన రోజునే తండ్రి మృతి

    ఖమ్మం: కవలలైన తన ఇద్దరు కుమార్తెల పుట్టిన రోజునే తండ్రి చికిత్స పొందుతూ మరణించిన ఘటన కూసుమంచిలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పుసులూరి యాదగిరి(35) ఓప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన కూర్చున్నచోటే కుప్పకూలి పోయాడు. ఆయనకు చికిత్స అందిస్తుండగా, శుక్రవారం మృతి చెందారు. శుక్రవారం నాడే ఆయన కవలలైన కుమార్తెల పుట్టిన రోజు.

  • కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు

    మెదక్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద, ఇళ్లకు నష్టం, విపత్కర పరిస్థితుల్లో వెంటనే 9391942254 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా అధికారులందరూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలన్నారు.

  • అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి

    కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని ఎస్‌యూ వీసీ, ఆచార్య యు.ఉమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో కొత్తగా పునరుద్ధరించిన సెమినార్ హాల్, ఎస్ఈయూ పరిపాలన భవనం మొదటి అంతస్తు, వర్సిటీకి నీటి సరఫరాకు పునాది రాయి వేయటం వంటి కార్యక్రమాలను మంత్రి ప్రారంభిస్తారని వీసీ పేర్కొన్నారు.

     

  • నేటి ప్రత్యేక ప్రజావాణి రద్దు

    వరంగల్: జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని  రద్దు చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనపరమైన కారణాలతో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి దివ్యాంగుల, వయోవృద్ధులు శనివారం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

  • ‘భవిష్యత్‌ను తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులు’

    విజయనగరం: షికారుగంజి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు లక్ష్మీ, పావనిలకు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం భోగాది ఆదినారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే శిల్పులని అన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీఛైర్మన్ దేవరపుసురేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి అని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

  • ‘జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

    శ్రీకాకుళం: ఈనెల 28న పాతపట్నం పట్టణంలోని మహేంద్ర డిగ్రీ కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం తెలిపారు.  పాతపట్నం నియోజకవర్గం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మోగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.