Author: Shivaganesh

  • పేకాట స్థావరాలపై పోలీసుల దాడి..

    శ్రీకాకుళం: పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసిన ఘటన శుక్రవారం రణస్థలం మండలం, దేవరపల్లి గ్రామం సమీపంలో వెలుగుచూసింది. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. దేవరపల్లి సమీపంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకొగా, మరి కొందరు తప్పించుకున్నారు. వారి నుంచి రూ.12420 నగదు,  4 ఫోన్లు, 4 బైక్‌లు సీజ్ చేసినట్లు తెలిపారు.

  • ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.772 కోట్లు..

    శ్రీకాకుళం: రాష్ట్రంలో ఆలయాల పునర్నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని, శ్రీకూర్మంలో ఉన్న శ్రీకూర్మనాథ స్వామి వారిని ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 9,098 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.772 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.

     

     

  • కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

    మన్యం: కురుపాం మండలం పూతిక వలస జంక్షన్ వద్ద శుక్రవారం ఎల్విన్‌పేట సీఐ హరి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించి, కొన్ని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన సీబుక్, లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై నారాయణరావు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

  • వరల్డ్ బ్రెయిన్ డే వేడుకలు

    తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడిలోని అమర హాస్పిటల్లో వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మెదడు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఆరోగ్య నిపుణులు పాల్గొని న్యూరో సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మెదడు ఆరోగ్యం కోసం నిత్యవ్యాయామం, యోగా, సరిగ్గా నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

  • అక్రమంగా నిర్మించిన 27 ఇళ్లు తొలగింపు..

    తిరుపతి: రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని వినాయకపురంలో చెరువు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన 27 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈసందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినప్పటికి ఆక్రమదారులు స్పందించకపోవడంతో, చర్యలకు దిగినట్లు తెలిపారు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖాళీ చేసిన భూమిని నీటిపారుదల శాఖకు అధికారికంగా అప్పగించారు.

     

  • ‘తల్లికి వందనం గురించి తెలియజేయాలి’

    చిత్తూరు: గుడిపాల మండలం చిత్తపార, సి.బండపల్లి, వెప్పాలమానుచేను, పాపసముద్రం గ్రామ పంచాయతీల పరిధిలో శుక్రవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన “సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికి మీ ఎమ్మెల్యే” కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రజా సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

  • ‘సమస్యను గౌరవంతో అర్థం చేసుకోవాలి’

    చిత్తూరు: అపోలో యూనివర్శిటీ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్కిజోఫ్రెనియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యాన్ని అపహాస్యం చేయకూడదని, సమస్యను గౌరవంతో అర్థం చేసుకోవాలని అన్నారు. డాక్టర్ పి.దినేష్ స్కిజోఫ్రెనియా లక్షణాలు, చికిత్సలను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

     

  • ‘ఆధారాలు చూపిస్తే చర్యలకు సిద్ధం’

    చిత్తూరు: కలెక్టర్‌కు తన తన పీఏ చంద్రశేఖర్‌పై కొందరు నాయకులు ఫిర్యాదు చేసిన విషయంపై శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఒక ప్రకటనలో స్పందించారు. తన పీఏ చేసిన అవినీతికి సంబంధించి ఆధారాలు సమర్పిస్తే తానే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చంద్రశేఖర్‌కు సంబంధించి ఎవరూ తనకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. తనకు నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని వెల్లడించారు.

  • రేపటితో మొదటి దశ కౌన్సిలింగ్ పూర్తి..

    చిత్తూరు: జిల్లాలోని అపోలో యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్ కన్వీనర్ కోటా అడ్మిషన్లు కొనసాగుతున్నాయని శుక్రవారం అడ్మిషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మహేంద్రనాథ్ చౌదరి తెలిపారు. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నాలెడ్జ్ సెంటర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందని, మొత్తం 273 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సిలింగ్ శనివారం వరకు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తివివరాల కోసం APEAPCET వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.

  • ‘తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’


    అన్నమయ్య: పీలేరులో శుక్రవారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనపల్లి పురుషోత్తం మీడియాతో మాట్లాడారు. కనీస వసతులు లేని ప్రైవేట్ ఆస్పత్రులు అనవసర పరీక్షలు, చికిత్సలతో ప్రజలను దోచుకుంటున్నాయని వాపోయారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం వికటించి మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. అర్హత లేని సిబ్బందితో వైద్యం చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.