Author: Shivaganesh

  • విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

    శ్రీకాకుళం: శ్రీకాకుళం ఆదిత్య కళాశాల విద్యార్థులకు శుక్రవారం మహిళా భద్రతపై రెండువ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఈశ్వరావు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళ భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాలు, మోసాల నుంచి జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించారు. 112, 1930, 1098, వంటి అత్యవసర నెంబర్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

     

  • ‘ఇబ్బంది లేకుండా ఎరువులు పంపిణీ చేయాలి’

    శ్రీకాకుళం: అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం వ్యవసాయ సంచాలకులు, అధికారులు, గ్రామ సహాయకులు, సొసైటీ ప్యాక్ సీఈవోలతో కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు జరుగుతున్న దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రైతులకు ఎరువులు పంపిణీ చేసినందుకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషించాలన్నారు. సమావేశంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

  • ‘పేదలకు భూములు ఇప్పించండి’

    శ్రీకాకుళం: పేదల సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు.సింహాచలం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల మండలం జాలారి కొయ్యంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి(గయాలి)లో వారు నీలగిరి మొక్కలు నాటారు. ఇప్పటికే సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

     

  • ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక

    శ్రీకాకుళం: టెక్కలిలో శుక్రవారం ఆర్టీసీలో జైభీం అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జిల్లా కార్యదర్శి బసవల ధనుంజయ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిపో ఛైర్మన్‌గా ఆర్.గణపతిరావు, అధ్యక్షుడిగా బోనెల ధర్మారావు, కార్యదర్శిగా జి.ఎన్. భూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎల్.త్రినాధరావు, ఉపాధ్యక్షుడిగా పి.వి.రావు, జాయింట్ సెక్రెటరీగా ఎస్.రామారావు, కమిటీ సభ్యులు ఎన్నికైనట్లు తెలిపారు.

  • సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం

    శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గం పాసి గంగుపేట గ్రామంలో శుక్రవారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రజా సంక్షేమ పథకాలు గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలని అందించి, వివరించారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

  • బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

    తిరుపతి: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఉచిత క్యాన్సర్ పరీక్షలు.. ఎక్కడంటే

    తిరుపతి: ఏర్పేడు, పాపానాయుడుపేట పిహెచ్‌సీలలో శుక్రవారం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. క్యాన్సర్ లక్షణాలు, నివారణపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు. బిపి, షుగర్, నోటి, రొమ్ము క్యాన్సర్ (మామోగ్రామ్), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (పాప్ స్మియర్) పరీక్షలు ఉచితంగా చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

     

  • మహిళా కానిస్టేబుల్ మృతి.. ఏం జరిగిందంటే

    తిరుపతి: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ చనిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతి గురువారం రాత్రి ఆమె ప్రియుడు వాసు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 80% కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో రుయా ఆసుపత్రిలో చేరారు. ఈక్రమంలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన వాసు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో జరిగినట్లు సమాచారం.

  • రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు..

    చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలైన ఘటన కార్వేటినగరం మండలంలోని కృష్ణ సముద్రంలో వెలుగుచూసింది. మానికి చెందిన మహిళ భర్తతో కలిసి పళ్లిపట్టు నుంచి బైకుపై ఇంటికి వస్తూ కళ్లు తిరిగి బైకుపై నుంచి రోడ్డుపై పడి గాయపడింది. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె రాణిపేట సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

     

  • ‘ప్రజల కలను నిజం చేశాం’

    విజయనగరం: నెల్లిమర్లలో శుక్రవారం ఎమ్మెల్యేగా లోకం నాగమాధవి ఫైర్ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు గత మూడు దశాబ్దాలుగా ఫైర్ స్టేషన్ కోసం పోరాడుతున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రజల కలను నిజం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.