Author: Shivaganesh

  • డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన

    విజయనగరం: ఎల్‌కోట మండలం రంగరాయపురం గ్రామంలో శుక్రవారం అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొని డ్రోన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు నాంది పలికారని  అన్నారు.

  • ‘కూటమి ప్రభుత్వంతో ప్రజలు మోసపోయారు’

    శ్రీకాకుళం: మందస మండలం కుంటికోట గ్రామంలో శుక్రవారం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలు నష్టపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • నాయకులతో ఎమ్మార్వో సమావేశం

    శ్రీకాకుళం: ఆముదాలవలస తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మార్వో రాంబాబు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ మార్పులు, చేర్పులు, తొలగింపులపై వారితో చర్చించారు. నాయకుల అభిప్రాయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

     

  • అంధ క్రీడాకారుడికి ఆర్థిక సాయం

    తిరుపతి: కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఛైర్మన్ డా.రమేష్‌నాథ్ లింగుట్ల అంధ క్రీడాకారుడు ముప్పాళ్ల శేషగిరికి శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు. సెప్టెంబర్ 1 ఆయన ఈజిప్టులో జరిగే అంతర్జాతీయ గోల్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్ర అంధుల క్రీడా సంఘం అధ్యక్షుడు పెంచల నరసయ్య విజ్ఞప్తి మేరకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • కనకమహాలక్ష్మి ప్రత్యేక పూజలు

    విజయనగరం: చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా పసుపు కొమ్ములతో అలంకరించారు. జామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 108 చీరలతో ఆర్యవైశ్య మహిళా సభ్యులు అలంకరణ చేశారు. అమ్మవార్లను దర్శించుకోడానికి వచ్చిన మహిళలు ఆలయంలో దీపారాధన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

  • తిరుపతి దేవస్థానికి రూ.20 లక్షలు విరాళం

    తిరుమల: తిరుపతి దేవస్థానానికి శుక్రవారం దాతలు రూ.20 లక్షల విరాళం అందజేశారు. తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ఛైర్మన్‌ పి.సి రాయల్‌ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, బెంగళూరుకి చెందిన సుకుమార్‌ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. దాతలు అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్యచౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

  • ‘సలహాలు, సూచనలు ఇవ్వాలి’

    బాపట్ల: చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల నాయకులతో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి టి.చంద్రశేఖర నాయుడు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులపై ఏమైనా సందేహాలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలని వారికి సూచించారు. ప్రతినెల రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    శ్రీకాకుళం: పోలాకి మండలం మబగాం పంచాయతీలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు గురువారం రాత్రి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయనిధి గొప్పవరం అని అన్నారు. ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో బాధిత కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన

    తిరుపతి: వాయల్పాడు మండలం చింతపర్తి పీహెచ్‌సీ పరిధిలోని బీసీ కాలనీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం డాక్టర్ జులేఖ బేగం ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ చట్టం, స్టాప్ డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలో లింగ నిష్పత్తి 926గా ఉందని, ఆడపిల్లలను సమానంగా చూడాలని కోరారు.

  • కనిగిరిలో బాల్య వివాహాలపై అవగాహన

    ప్రకాశం: “బంగారు బాల్యం” కార్యక్రమంలో భాగంగా కనిగిరిలో గురువారం బాల్య వివాహాలు – బాలల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేసిన వారికి రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు 1098, 100, 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.