Author: Shivaganesh

  • అక్రమ సంబంధం అనుమానంతో హత్యాయత్నం

    తిరుపతి: వివాహేతర సంబంధం అనుమానంతో హత్యయత్నానికి పాల్పడిన ఘటనపై గురువారం కేసునమోదు చేశారు. సీఐ జయచంద్ర  మాట్లాడుతూ.. దొడ్లమిట్టలో ఉంటున్న నవీన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్యకు నవీన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో బుధవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న నవీన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గుర్తించిన ఆయన బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.

  • చీరాలలో సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమం

    బాపట్ల: చీరాల మున్సిపాలిటీ 29వ వార్డులో గురువారం సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సాంబశివరావు, వైస్ ఛైర్మన్ సుబ్బయ్య, ప్రజలు పాల్గొన్నారు.

  • ‘తలకోన ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు’

    తిరుపతి: యర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీలోని తలకోన ఆలయ అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కృషి ఫలితంగా రూ. 18 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 2 కోట్లు విడుదలైనట్లు ఆలయ బోర్డు ఛైర్మన్ సోమునాథరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ..  ఆలయ పునర్నిర్మాణం, కోనేరు, వసతిగదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తలకోనను ప్రముఖపర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

  • పెరిదేపిలో విఎస్ సంతాప సభ

    ప్రకాశం: కొండేపి మండలం పెరిదేపిలో గురువారం కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ సీఎం విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి మల్లెల కొండయ్య, పార్టీ సీనియర్ నాయకులు  ముప్పురాజు కోటయ్య పాల్గొని మాట్లాడుతూ.. విఎస్‌ అంటే కేవలం రాజకీయ నేత కాదు, కేరళ మనస్సాక్షి అని కొనియడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • ‘తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలి’

    విజయనగరం: విజయనగరం మండలం సారిక గ్రామంలో గురువారం ఈఓపీఆర్డీ శ్రీనివాస్ రావు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన సర్పంచ్ బొబ్బది ఈశ్వరరావుతో కలిసి గ్రామంలో ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని అన్నారు. వాటితో ఎరువులను తయారుచేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి చిన్నారావు, ఇంజినీరింగ్ అస్టెంట్ దీప్తి పాల్గొన్నారు.

  • ‘ఫలప్రదంగా విద్యా ప్రవేశ్ సంసిద్ధతా’

    ప్రకాశం: గిద్దలూరు మండలం చిన్నకంభం ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యా ప్రవేశ్ సంసిద్ధతా కార్యక్రమాలు ఫలప్రదంగా సాగుతున్నాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ బాబు విద్యార్థులకు గణిత శిక్షణతో పాటు సామాజిక నైపుణ్యాలు, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న తీరుపై ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • సినిమా చాలా బాగుంది: ఎమ్మెల్యే

    విజయనగరం: పార్వతీపురంలోని ఓ సినిమా హాల్లో గురువారం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమాను  కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ తిలకించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని, కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఎలా మెలగాలనేది సినిమాలో చూపించారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ కడ్రక కళావతి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • మహా శివుడికి ప్రత్యేక పూజలు

    జగిత్యాల: ధర్మపురిలో మహా శివుడికి వరుణుడి కటాక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం బ్రాహ్మణవాడలోని బొజ్జవారి గద్దెపై వర్షాలు సమృద్ధిగా కురవాలని వేద పండితులు అభిషేక ప్రియుడైన శంకరుడికి గోదావరి నది నుంచి జలాలను తీసుకొచ్చి అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ.. వర్షాలు కురిసి పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

  • కొత్త యాస్వాడాలో బోనాల పండుగ

    కరీంనగర్: విద్యానగర్ కొత్తయాస్వాడ కాలనీలో ఆదివారం బోనాల జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగతో స్థానికంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వేడుకలో సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బోనాల పండుగలో పాల్గొని స్వయంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ప్రజలలో సంస్కృతి, సంప్రదాయాల విలువల పెంపుదలకు, సమైక్యతకు ప్రతి ఏడాది బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

  • కారాగాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

    కరీంనగర్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి K.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించారు.ఈసందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విచారణ ఖైదీలతో మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కారాగారంలో ఉన్న సమయంలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.