పెద్దపల్లి: కలెక్టరేట్లో ఈనెల 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. SSC నుంచి MBA వరకు అర్హత కలిగి, 18- 45 ఏళ్ల వయసు గల యువతీయువకులు హాజరుకావాలని సూచించారు. కృషివిజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, HR మేనేజర్, ఆఫీస్ బాయ్ తదితర పోస్టుల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Author: Shivaganesh
-
వామ్మో క్షుద్రపూజలు..
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణ నడిబొడ్డులోని నెహ్రుసెంటర్లో ఓ మొబైల్ షాప్ ముందు మెట్ల కింద క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. యాజమాని శ్రీదర్ రాత్రి షాపును మూసి, ఉదయం వెళ్లి ఓపెన్ చేస్తుండగా క్షుద్రపూజల ఆనవాళ్లు గుర్తించారు. క్షుద్రపూజలు పట్టణాలకు చేరాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
-
ఈనెల 23న వాహనాల వేలం పాట
మహబూబాబాద్: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఈనెల 23న ఉదయం 10 గంటలకు మహూబాబాద్‌తో పాటు కురవి, డోర్నకల్, గార్ల పోలీస్ స్టేషన్లో వేలం ఉందని చెప్పారు. వేలం పాటలో పాల్గొనేవారు వాహన ధరలో 50% ప్రోహిబిషన్ & మహబూబాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరున డీడీ తీయాలన్నారు.
-
డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు సీజ్
హన్మకొండ: జిల్లాలోని పలు ఎలక్ట్రిక్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైడ్స్ నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పలు షాపుల నుంచి డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు షాపుల నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
-
ముత్యాలమ్మ జాతరకు ముస్తాబు
మెదక్: నర్సాపూర్‌లో ఆషాడ మాసం పురస్కరించుకొని ముత్యాలమ్మ దేవాలయం జాతరకు ముస్తాబు చేశారు. ఆదివారం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. సాయంత్రం బండ్ల బోనాలు, తొట్టల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.
-
వైభవంగా బోనాల పండుగ
సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు, డప్పుల చప్పుల మధ్య మహిళలు బోనాలు ఎత్తికుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని చిమ్ముల గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-
పీర్ల పండుగకు ఆహ్వానం
సంగారెడ్డి: సీజీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీలో నిర్వహించనున్న పీర్ల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఈసందర్భంగా పండుగ నిర్వాహకులు గోవర్ధన్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో పండుగ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
-
గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం అందజేత
సంగారెడ్డి: జిన్నారం మండల కేంద్రంలో సోమవారం బోనాల పండుగ నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆదివారం గ్రామస్థులు, దేవాలయ కమిటీ సభ్యులు సీజీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. పండుగలో భాగంగా నిర్వహించనున్న తొట్టెల ఊరేగింపు, పలారం బండి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పని సరి’
భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ రోహిత్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో నేరాలను నియంత్రించడానికి, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలిని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
హన్మకొండ: పలివేల్పులలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రం పరిసరాలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని, గర్భీణులు, బాలింతలకు పోషకాహారం అందజేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.