భద్రాద్రి కొత్తగూడెం: రూ.3 లక్షల లోన్ ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన అశ్వారావుపేట మండలం మద్దికొండలో వెలుగుచూసింది. ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లో రూ.3లక్షలు ఆశ చూపి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.57,025 కాజేశారు. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Author: Rafi
-
పుష్పంబరిగా నల్లపోచమ్మ..
మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీనల్లపోచమ్మ దేవాలయంలోఆదివారం అమ్మవారు పుష్పంబరి మాతగా దర్శనం ఇచ్చారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పూజారి శివప్ప, ఈవో రంగారావు, వెంకటరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
-
స్కాలర్షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: ప్రతిభ గల ఓసీ విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందిస్తామని ‘ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ వరంగల్ అధ్యక్షురాలు ఎం.రేణుక తెలిపారు. ఆసక్తిగల విద్యిర్థినులు ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. ఎంబీబీఎస్, బీటెక్, పీజీ తదితర కోర్సుల్లో చేరిన వరంగల్ నగర విద్యార్థినులకు ‘నేరళ్ల శోభావతి స్కాలర్షిప్స్’ పేరిట ప్రోత్సాహం అందిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9849987805 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
-
నాలుగు టిప్పర్లు సీజ్
సిద్దిపేట: అనుమతి లేకుండా చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న తరలిస్తున్న నాలుగు టిప్పర్లు, ఇటాచీని సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కొండపాక మండలంలోని దమ్మక్కపల్లిలోని చెరువులో నుంచి అక్రమంగా మట్టిని తవ్వి టిప్పర్లలో తరలించి విక్రయిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి, టిప్పర్లు, ఇటాచీని సీజ్ చేశామన్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
-
ఈనెల 23 లాస్ట్ డేట్..
సిద్దిపేట: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈనెల 23లోగా దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించి, పీహెచ్, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
-
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమనస్)లో అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నిఖత్ అంజుమ్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 22లో గా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ జీరాక్స్ కాపీలతో దరఖాస్తును కళాశాలలోని కార్యాలయంలో అందజేయాలన్నారు. 23న ఉదయం 11గంటలకు ఇంటర్వ్యూ, డెమో క్లాసుల ద్వారా ఎంపిక చేస్తారన్నారు.
-
రేపటి నుంచి 27 వరకు అవకాశం..
సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ పట్టభద్రులకు ఆర్టీసీ డిపో పరిధిలో మూడేళ్లపాటు అప్రెంటిస్ నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ ఇన్ ఐటీ, కంప్యూటర్ సైన్స్‌లో 2021లో ఉత్తీర్ణులైనవారు ఈ అప్రెంటీస్‌కు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 21 నుంచి 27 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
-
బైక్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం అశ్వారావుపేట మండలంలో వెలుగుచూసింది. నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకన్న బైక్‌పై అశ్వారావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మరో బైక్ ఎదురుగుగా వచ్చి ఢీకొనింది. ప్రమాదంలో వెంకన్న ఎడమ కాలు విరిగిపోయింది. స్థానికులు ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
-
బైక్ చోరీ.. కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల: ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ అయిన ఘటన గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్ది గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వేముల శ్రీధర్ తన బైక్‌ను రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేశారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ బైక్‌ను చోరీ చేశారు. ఉదయం చూసే సరికి బైక్ కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల: రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. గొల్లపల్లికి చెందిన అహ్మద్ ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తూ అగ్రహారం గ్రామానికి చెందిన మునిగేదాను ప్రభు, అతని అల్లుడు ధనుష్‌ల స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టాడు. క్షతగాత్రులను బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ దిలీప్ ఆస్పత్రికి తరలించారు.