Author: Rafi

  • యథేచ్ఛగా మొరం దందా

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలో యథేచ్ఛగా మొరం దందా జరుగుతుందని స్థానికులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినం కావడంతో అక్రమంగా ట్రాక్టర్‌లలో మొరం దందా సాగుతోందని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలు ఆపాలని కోరారు.

  • గంజాయి అమ్ముతూ దొరికిన హోంగార్డు..

    సంగారెడ్డి: గంజాయి అమ్ముతూ హోంగార్డు, పోలీసులకు పట్టుబడిన ఘటన శనివారం కంది మండల కేంద్రంలో వెలుగుచూసింది. మండల కేంద్రంలోని తాజ్ హోటల్ వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్న హోంగార్డు రాజును స్థానికులు పట్టుకున్నారు. వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రాజు నుంచి సుమారు కిలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • ‘పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేయాలి’

    మెదక్: నర్సాపూర్‌లోని సాయికృష్ణ రైస్ మిల్లును కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన రబీ 2023-24 సీఎంఆర్ డెలివరీని పరిశీలించి, ఇంకా 5,965 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉందని గుర్తించారు. ఈనెల 27లోగా పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేయాలని, లేనిపోతే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి’

    జనగామ: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌కు మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని డీఆర్డీఓ ఎన్.వసంత ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న దృష్టిలోపం, కంటి చూపు, తలసేమియా దివ్యాంగులు, 23న లెప్రసీ, 25న వినికిడి, మూగ, 29న లెప్రసీ 31న మెంటల్ ఇల్నెస్, ఇంటెలెక్చువల్‌కు గాను కొత్తవి 140 స్లాట్లు ఉండగా.. రెన్యువల్ 90 స్లాట్ ఉన్నట్లు వినియోగించుకోవాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    జగిత్యాల: అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకానికి ఎస్సీ విద్యార్థుల నుంచి 2025-26 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆగస్టు 31 వరకు WWW. TELANGANA, EPASS.CGG. GOV. IN కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షలతో పాటు, వీసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • పేకాటరాయుళ్ల అరెస్టు..

    జగిత్యాల: పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేసి 9 మందిని పట్టుకున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. కోరుట్ల మండలం అయిలాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై చిరంజీవి, సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో 9 మందిని పట్టుకుని వారి నుంచి రూ.6500 నగదు, 9 ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • అంజన్న ఆదాయం లెక్కింపు అప్పుడే..

    జగిత్యాల: కొండగట్టు అంజన్న ఆలయ హుండీ ఆదాయాన్ని ఈనెల 23న లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీకాంతీరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి సమక్షంలో లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

     

  • ‘అధికారులు స్పందించాలి’

    మెదక్: రామాయంపేట వ్యవసాయ మార్కెట్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి చెట్లు నేలకు ఒరిగాయి. రెండు రోజులు గడుస్తున్నా, రామాయంపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై కూలిన చెట్లను అధికారులు తొలగించలేదని వాహనదారులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని కోరారు.

  • ‘బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషించాలి’

    మెదక్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషించాలని అన్నారు. ప్రభుత్వం పథకాలైన ఇందిర మహిళాశక్తి, రాజీవ్ యువ వికాసం వంటివాటిని విజయవంతంగా అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు బ్యాంకు అధికారులు, పాల్గొన్నారు.

  • చికిత్స పొందుతూ ఒకరి మృతి

    ఖమ్మం: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన కల్లూరు మండలం పెద్దకోరుకొండిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కోమటి లాజరు(35) మే నెల 12వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెండారు.  ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.