Author: Shivaganesh

  • ‘నానో యూరియాతో మంచి లాభాలు’

    మెదక్: నానో యూరియాతో మంచి లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈసందర్భంగా వ్యవసాయ సంచాలకులు రాజ్‌నారాయణ మాట్లాడుతూ.. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక బస్తా సాంప్రదాయ యూరియాతో సమానమని పేర్కొన్నారు. రామయంపేట పట్టణ శివారులో నర్సింలు అనే రైతు తన వరి పొలంలో నానో యూరియా పిచికారి చేయగా, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.

  • ‘గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి’

    మెదక్: జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, మతసామరస్యంతో జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. బుధవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి పనిచేసి, విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని, ప్రమాదాలు నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనం, ఊరేగింపుల సమయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు తెలిపారు.

  • ‘తక్షణం నష్టపరిహారం చెల్లించాలి’

    ఆదిలాబాద్: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్‌ను సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ కోసం సేకరించిన 1,200 ఎకరాల్లో 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని అన్నారు. మిగతా 1,020 ఎకరాలకు ఏడేళ్లుగా పరిహారం చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • ‘ఆధునిక భారతదేశ నిర్మాత’

    సంగారెడ్డి: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రామచంద్రారెడ్డి నగర్‌లోని ఆయన విగ్రహానికి కార్పొరేటర్ పుష్ప నగేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ‘ఆధునిక భారతదేశ నిర్మాత’గా కొనియాడారు. ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • జోగిపేటలో రాజీవ్ జయంతి వేడుకలు

    సంగారెడ్డి: జోగిపేటలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందోల్-జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అందోల్ మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్, జోగిపేట పట్టణ బాధ్యులు డాకూరి వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.

  • హుస్నాబాద్‌లో రాజీవ్ జయంతి వేడుకలు

    సిద్దిపేట: హుస్నాబాద్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చెట్లు నాటి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

  • ‘రోడ్లు మరమ్మతులు చేపట్టాలి’

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని ఎవరెస్ట్ ఎంక్లేవ్, జీటీఆర్ వెంచర్ల వాసులు రోడ్లు మరమ్మతులు చేయాలని మున్సిపల్ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. రోడ్లు బాగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అత్యవసర సమయాల్లో ప్రయాణించడం కష్టంగా మారిందని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

  • నల్లవాగును పరిశీలించిన కలెక్టర్

    సంగారెడ్డి: సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును బుధవారం కలెక్టర్ పి.ప్రవీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు నీటి మట్టాలు, సాగు సౌకర్యాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సకాలంలో నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పలువురు మండల అధికారులు పాల్గొన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ పేదలకు ఒక వరం లాంటిదని అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

  • ‘యూరియా కోసం పడిగాపులు కాస్తున్నం’

    మెదక్: నర్సాపూర్ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం పీఏసీఎస్ ముందు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు. యూరియా సకాలంలో లభించకపోతే పంటలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరా చేయాలని కోరారు.