వరంగల్: చెరువులో చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు పిడుగుపాటుతో మృతి చెందిన ఘటన సంగెం మండలం ఎల్గూర్‌రంగంపేటలో చోటుచేసుకుంది. గ్రామ చెరువులో శనివారం పలువురు మత్స్యకారులతో పాటు బోనాల సుధాకర్(48) చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చి చెరువులో సుధాకర్ సమీపంలో పిడుగు పడగా, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
Author: Rafi
-
‘అర్హులకు తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి’
పెద్దపల్లి: రామగుండం తహసీల్దార్‌కు శనివారం మద్దెల దినేష్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన 5,556 రేషన్ కార్డు దరఖాస్తుల్లో 3,197 మంజూరవగా, 888 జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయని, 1,470పై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన వారికి తక్షణమే కార్డులు ఇవ్వాలని, కలెక్టర్ స్పందించకపోతే ఆందోళనలు తప్పవని అన్నారు.
-
మందుబాబు హల్‌చల్.. ఎక్కడంటే
భద్రాద్రికొత్తగూడెం: మద్యం మత్తులో మందుబాబు హల్‌చల్ చేసిన ఘటన శనివారం అశ్వాపురం మండలం మొండికుంటలోని ఓ వైన్ షాపులో వెలుగుచూసింది. గ్రామంలోని వైన్ షాపులో అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని మందుబాబు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశారు. పెట్రోల్ మీద పోస్తానంటూ బెదిరింపులకు దిగడంతో వైన్స్ షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో అతడని అదుపులోకి తీసుకున్నారు.
-
నిజాంపేటలో ఘోరం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం నిజాంపేట మండల శివారులోని మూలమలుపు వద్ద చోటుచేసుకుంది. మూలమలుపు వద్ద బైక్, టాటా ఏసీ వాహనం ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్థానికులు క్షతగాత్రులు 108 అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘స్థాయి మరచి మాట్లాడితే ఊరుకోం’
హన్మకొండ: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మీడియాతో మాట్లాడారు. స్థాయిని మరచి మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని నమ్మిన వాళ్లం కాబట్టే మీ పాపాలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేచి చూస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుల తీరును ఎండగట్టారు. పదేళ్లలో ప్రశ్నించడమే పాపంగా 54 కేసులు పెట్టినారని అన్నారు.
-
కాకతీయ పాఠశాలలో బోనాల సంబరాలు
పెద్దపల్లి: బోనాల పండుగ సందర్భంగా శనివారం ముందస్తుగా కాకతీయ పాఠశాలలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని పాఠశాల ప్రాంగణం నుంచి బోనమెత్తి రేణుక ఎల్లమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. రాజమౌళి గౌడ్, పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాల డైరెక్టర్లు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
కేంద్ర మంత్రిని కలిసిన జిల్లా అధికారులు
సంగారెడ్డి: IIT హైదరాబాద్ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి శనివారం ముఖ్యఅతిథిగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయనను కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి స్నాతకోత్సవల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
-
కాలభైరవుడికి ప్రత్యేక పూజలు
సంగారెడ్డి: సదాశివపేట మండలం ఆరూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ లక్ష్మీ, కాలభైరవ, కుబేర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మడుపతి సంతోష్ స్వామి మాట్లాడుతూ.. వేకువ జామునే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.
-
బాధిత కుటుంబానికి నాయకుల అండ..
మెదక్: శివంపేట మండలం రూప్ల తండాకు చెందిన జరుపుల ఓబ్య లావణ్య దంపతుల కుమారుడు చిన్నారి నితిన్ శుక్రవారం వీధి కుక్కల దాడిలో మృతిచెందిన విషయం విధితమే. శనివారి వారి ఇంటికి మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్‌గుప్త వెళ్లి వారిని పరామర్శించి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి రూ.5 వేలు అందజేసి అండగా నిలిచారు.
-
ఈటల ఇంటికి హుజూరాబాద్ నాయకులు
కరీంనగర్: హుజురాబాద్ బీజేపీ నాయకులు శనివారం పెద్ద సంఖ్యలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. శామీర్పేటలోని ఈటల నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు కరీంనగర్ జిల్లాలో ఈటల వర్గాన్ని పార్టీకి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలిపాలని విన్నవించారు. తాము 25 ఏళ్లుగా ఈటల వెంటే ఉన్నామని గుర్తు చేశారు.