భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ రోహిత్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో నేరాలను నియంత్రించడానికి, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలిని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Author: Rafi
-
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
హన్మకొండ: పలివేల్పులలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రం పరిసరాలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని, గర్భీణులు, బాలింతలకు పోషకాహారం అందజేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
-
మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
మెదక్: నర్సాపూర్‌లో ఆదివారం బీజేపీ నాయకులు ప్రధాని మోడీ, ఎంపీ రఘునందన్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దుండిగల్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు నాలుగు లైన్ల రోడ్డును మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు వెంటనే స్పందించినందుకు ఎంపీ రఘునందన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
కేయూలో విచారణకు కమిటీ ఏర్పాటు
హన్మకొండ: కేయూలోని విద్యాకళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ శ్రీనివాస్‌పై విద్యార్థులు పలు ఆరోపణలు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంకు ఈనెల 18న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును వీసీ ప్రతాప్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ఛైర్మన్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మేఘనరావు, సభ్యులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత, డాక్టర్ మంజులను నియమించినట్లు పేర్కొన్నారు.
-
గిరిజన విద్యార్థులకు శిక్షణ
వరంగల్: ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రతిభ గల గిరిజన విద్యార్థులకు జేఈఈ, నీట్‌లో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 లోపు ఆసక్తిగల గిరిజన విద్యార్థులు బాలసముద్రంలోని టీడబ్ల్యూ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు 7675978439, 8328546015 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
-
మద్దికొండలో సైబర్ మోసం.. కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం: రూ.3 లక్షల లోన్ ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన అశ్వారావుపేట మండలం మద్దికొండలో వెలుగుచూసింది. ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లో రూ.3లక్షలు ఆశ చూపి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.57,025 కాజేశారు. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
పుష్పంబరిగా నల్లపోచమ్మ..
మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీనల్లపోచమ్మ దేవాలయంలోఆదివారం అమ్మవారు పుష్పంబరి మాతగా దర్శనం ఇచ్చారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పూజారి శివప్ప, ఈవో రంగారావు, వెంకటరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
-
స్కాలర్షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: ప్రతిభ గల ఓసీ విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందిస్తామని ‘ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ వరంగల్ అధ్యక్షురాలు ఎం.రేణుక తెలిపారు. ఆసక్తిగల విద్యిర్థినులు ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. ఎంబీబీఎస్, బీటెక్, పీజీ తదితర కోర్సుల్లో చేరిన వరంగల్ నగర విద్యార్థినులకు ‘నేరళ్ల శోభావతి స్కాలర్షిప్స్’ పేరిట ప్రోత్సాహం అందిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9849987805 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
-
నాలుగు టిప్పర్లు సీజ్
సిద్దిపేట: అనుమతి లేకుండా చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న తరలిస్తున్న నాలుగు టిప్పర్లు, ఇటాచీని సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కొండపాక మండలంలోని దమ్మక్కపల్లిలోని చెరువులో నుంచి అక్రమంగా మట్టిని తవ్వి టిప్పర్లలో తరలించి విక్రయిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి, టిప్పర్లు, ఇటాచీని సీజ్ చేశామన్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
-
ఈనెల 23 లాస్ట్ డేట్..
సిద్దిపేట: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈనెల 23లోగా దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించి, పీహెచ్, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.