విజయనగరం: చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా పసుపు కొమ్ములతో అలంకరించారు. జామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 108 చీరలతో ఆర్యవైశ్య మహిళా సభ్యులు అలంకరణ చేశారు. అమ్మవార్లను దర్శించుకోడానికి వచ్చిన మహిళలు ఆలయంలో దీపారాధన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
Author: Rafi
-
తిరుపతి దేవస్థానికి రూ.20 లక్షలు విరాళం
తిరుమల: తిరుపతి దేవస్థానానికి శుక్రవారం దాతలు రూ.20 లక్షల విరాళం అందజేశారు. తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ పి.సి రాయల్ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, బెంగళూరుకి చెందిన సుకుమార్ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. దాతలు అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్యచౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
-
‘సలహాలు, సూచనలు ఇవ్వాలి’
బాపట్ల: చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల నాయకులతో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి టి.చంద్రశేఖర నాయుడు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులపై ఏమైనా సందేహాలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలని వారికి సూచించారు. ప్రతినెల రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం: పోలాకి మండలం మబగాం పంచాయతీలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు గురువారం రాత్రి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయనిధి గొప్పవరం అని అన్నారు. ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో బాధిత కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-
లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన
తిరుపతి: వాయల్పాడు మండలం చింతపర్తి పీహెచ్‌సీ పరిధిలోని బీసీ కాలనీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం డాక్టర్ జులేఖ బేగం ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ చట్టం, స్టాప్ డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలో లింగ నిష్పత్తి 926గా ఉందని, ఆడపిల్లలను సమానంగా చూడాలని కోరారు.
-
కనిగిరిలో బాల్య వివాహాలపై అవగాహన
ప్రకాశం: “బంగారు బాల్యం” కార్యక్రమంలో భాగంగా కనిగిరిలో గురువారం బాల్య వివాహాలు – బాలల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేసిన వారికి రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు 1098, 100, 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
అక్రమ సంబంధం అనుమానంతో హత్యాయత్నం
తిరుపతి: వివాహేతర సంబంధం అనుమానంతో హత్యయత్నానికి పాల్పడిన ఘటనపై గురువారం కేసునమోదు చేశారు. సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. దొడ్లమిట్టలో ఉంటున్న నవీన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్యకు నవీన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో బుధవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న నవీన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గుర్తించిన ఆయన బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
-
చీరాలలో సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమం
బాపట్ల: చీరాల మున్సిపాలిటీ 29వ వార్డులో గురువారం సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సాంబశివరావు, వైస్ ఛైర్మన్ సుబ్బయ్య, ప్రజలు పాల్గొన్నారు.
-
‘తలకోన ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు’
తిరుపతి: యర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీలోని తలకోన ఆలయ అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కృషి ఫలితంగా రూ. 18 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 2 కోట్లు విడుదలైనట్లు ఆలయ బోర్డు ఛైర్మన్ సోమునాథరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణం, కోనేరు, వసతిగదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తలకోనను ప్రముఖపర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
-
పెరిదేపిలో విఎస్ సంతాప సభ
ప్రకాశం: కొండేపి మండలం పెరిదేపిలో గురువారం కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ సంతాప సభ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి మల్లెల కొండయ్య, పార్టీ సీనియర్ నాయకులు ముప్పురాజు కోటయ్య పాల్గొని మాట్లాడుతూ.. విఎస్ అంటే కేవలం రాజకీయ నేత కాదు, కేరళ మనస్సాక్షి అని కొనియడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.