Author: Rafi

  • ‘తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలి’

    విజయనగరం: విజయనగరం మండలం సారిక గ్రామంలో గురువారం ఈఓపీఆర్డీ శ్రీనివాస్ రావు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన సర్పంచ్ బొబ్బది ఈశ్వరరావుతో కలిసి గ్రామంలో ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని అన్నారు. వాటితో ఎరువులను తయారుచేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి చిన్నారావు, ఇంజినీరింగ్ అస్టెంట్ దీప్తి పాల్గొన్నారు.

  • ‘ఫలప్రదంగా విద్యా ప్రవేశ్ సంసిద్ధతా’

    ప్రకాశం: గిద్దలూరు మండలం చిన్నకంభం ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యా ప్రవేశ్ సంసిద్ధతా కార్యక్రమాలు ఫలప్రదంగా సాగుతున్నాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ బాబు విద్యార్థులకు గణిత శిక్షణతో పాటు సామాజిక నైపుణ్యాలు, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న తీరుపై ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • సినిమా చాలా బాగుంది: ఎమ్మెల్యే

    విజయనగరం: పార్వతీపురంలోని ఓ సినిమా హాల్లో గురువారం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమాను  కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ తిలకించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని, కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఎలా మెలగాలనేది సినిమాలో చూపించారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ కడ్రక కళావతి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • మహా శివుడికి ప్రత్యేక పూజలు

    జగిత్యాల: ధర్మపురిలో మహా శివుడికి వరుణుడి కటాక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం బ్రాహ్మణవాడలోని బొజ్జవారి గద్దెపై వర్షాలు సమృద్ధిగా కురవాలని వేద పండితులు అభిషేక ప్రియుడైన శంకరుడికి గోదావరి నది నుంచి జలాలను తీసుకొచ్చి అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ.. వర్షాలు కురిసి పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

  • కొత్త యాస్వాడాలో బోనాల పండుగ

    కరీంనగర్: విద్యానగర్ కొత్తయాస్వాడ కాలనీలో ఆదివారం బోనాల జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగతో స్థానికంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వేడుకలో సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బోనాల పండుగలో పాల్గొని స్వయంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ప్రజలలో సంస్కృతి, సంప్రదాయాల విలువల పెంపుదలకు, సమైక్యతకు ప్రతి ఏడాది బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

  • కారాగాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

    కరీంనగర్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి K.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించారు.ఈసందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విచారణ ఖైదీలతో మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కారాగారంలో ఉన్న సమయంలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • పెద్దపల్లిలో 24న జాబ్ మేళా

    పెద్దపల్లి: కలెక్టరేట్లో ఈనెల 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. SSC నుంచి MBA వరకు అర్హత కలిగి, 18- 45 ఏళ్ల వయసు గల యువతీయువకులు హాజరుకావాలని సూచించారు. కృషివిజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, HR మేనేజర్, ఆఫీస్ బాయ్ తదితర పోస్టుల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

  • వామ్మో క్షుద్రపూజలు..

    మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణ నడిబొడ్డులోని నెహ్రుసెంటర్లో ఓ మొబైల్ షాప్ ముందు మెట్ల కింద క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. యాజమాని శ్రీదర్ రాత్రి షాపును మూసి, ఉదయం వెళ్లి ఓపెన్ చేస్తుండగా క్షుద్రపూజల ఆనవాళ్లు గుర్తించారు. క్షుద్రపూజలు పట్టణాలకు చేరాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

  • ఈనెల 23న వాహనాల వేలం పాట

    మహబూబాబాద్: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఈనెల 23న ఉదయం 10 గంటలకు మహూబాబాద్‌తో పాటు కురవి, డోర్నకల్, గార్ల పోలీస్ స్టేషన్లో వేలం ఉందని చెప్పారు. వేలం పాటలో పాల్గొనేవారు వాహన ధరలో 50% ప్రోహిబిషన్ & మహబూబాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరున డీడీ తీయాలన్నారు.

  • డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు సీజ్

    హన్మకొండ: జిల్లాలోని పలు ఎలక్ట్రిక్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైడ్స్ నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పలు షాపుల నుంచి డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు షాపుల నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.