Author: Rafi

  • విద్యుత్ బంద్.. ఎక్కడంటే

    జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఏఈ సుందర్ తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గం టల వరకు కల్లెడ, తక్కళ్లపల్లి, సోమనపల్లి, సంగంపల్లి, హబ్సీపూర్, గుట్రాజ్పల్లి, అనంతారం, లక్ష్మీపూర్, జాబితాపూర్, ధర్మారం, తిమ్మాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

     

  • దరఖాస్తుల ఆహ్వానం

    జగిత్యాల: మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్థికసేవలు, బీమారంగంలో ఉచిత శిక్షణ ఉపాధి కార్యక్రమం అందిస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. ఈనెల 18 నుంచి వచ్చేనెల 18 వరకు మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను మైనార్టీ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో నెల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 040-23236112 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

  • ప్రసన్నాంజనేయుడికి ప్రత్యేక పూజలు

    మెదక్: నర్సాపూర్ బస్టాండ్‌ సమీపంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాడ మాసం శనివారం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పుర రైతులు హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

     

     

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

    ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన కారేపల్లి మండలం వెంకటసాయినగర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన భూపతి సుమన్ బైక్‌పై ఇల్లెందు వైపు వెళ్తుండగా భాగ్యనగర్ తండాకు చెందిన బాణోత్ వస్రాం సైకిల్‌ను బైక్ అదుపుతప్పి ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వారిని 108లో ఆస్పత్రికి తరలించారు.

  • విద్యుత్తు వినియోగదారులకు గమనిక

    ఖమ్మం: నగరంలోని 11కేవీ మైసమ్మ గుడి ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్ 2 ఏడీ యాదగిరి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఆర్‌కే సిల్క్ వెనక, వరదయ్యనగర్, మమత ఆస్పత్రి రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగనుందని తెలిపారు, వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.

  • 23న కేయూకు రానున్న ఆకునూరి మురళి

    హన్మకొండ: రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ఈనెల 23న కాకతీయ యూనివర్సిటీకి రానున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థి, ఉద్యోగసంఘాలు, పరీక్షల నియంత్రణాధికారి, విభాగాల అధిపతులు, డీన్‌లు, ప్రిన్సిపాళ్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సి పాల్స్, సమయానికి అనుగుణంగా కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

     

  • నేటి నుంచి తపాలా సేవలు బంద్

    వరంగల్: తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా శనివారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తపాలాశాఖ సేవలు నిలిపివేయనున్నట్లు వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా నూతనసాఫ్ట్వేర్ అమలు చేయనున్న నేపథ్యంలో సేవలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతారని, సేవలుమాత్రం కొనసాగవని, ఖాతాదారులు ఈవిషయం గమనించి సహకరించాలని కోరారు.

  • వారికి గుడ్ న్యూస్..

    మెదక్: 2008 DSC ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ టీచర్లకు ఇకపై ప్రతినెల వేతనాలు చెల్లించనున్నట్లు డీఈఓ రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇకపై ప్రతినెల MEO ల ద్వారా వేతనాలు చెల్లిస్తామని, విషయాన్ని గమనించాలని సూచించారు.

  • ‘పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం’

    మెదక్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 250 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • త్వరలో నోటిఫికేషన్..

    మెదక్: జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలో ఖాళీగా ఉన్న 12 లెక్చరర్ పోస్టులను త్వరలో గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా భర్తీ చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవి తెలిపారు. ఉన్నతాధికారులు సంబంధిత నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 16 ఫిజికల్ డైరెక్టర్(PD) పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు లెక్చరర్ల ద్వారా వ్యాయామశిక్షణ అందిస్తున్నామన్నారు.