ఖమ్మం: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో వెలుగుచూసింది. మధిర రైల్వేస్టేషన్ మార్గంలో వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలుకిందపడి గుర్తుతెలియని వ్యక్తి (55) ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించామని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Author: Rafi
-
చికిత్స పొందుతూ ఒకరి మృతి
రాజన్న సిరిసిల్ల: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వరుస దేవానందం (62) ఈనెల 15న తన వ్యవసాయపొలం వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం మృతిచెందాడు. కేసునమోదు చేసినట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి పేర్కొన్నారు.
-
గుండెపోటుతో ఒకరి మృతి
కరీంనగర్: గుండెపోటుతో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం కొడిమ్యాల మండలం పోరండ్ల గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన చిన్నిరాజం నాచుపల్లి గ్రామంలోని బృందావన్ రిసార్ట్‌లో కార్మికుడి గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన శుక్రవారం తన దుస్తులు ఉతుక్కోవడానికి బాత్రూంకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
-
250 బస్తాల నల్లబెల్లం సీజ్..
మహబూబాబాద్: భారీగా నల్లబెల్లం, పటిక, గుడుంబా పట్టుకున్నామని శుక్రవారం మహబూబాబాద్ రూరల్ పీఎస్ ఎస్సై వి.దీపిక తెలిపారు. శనిగపురం శివారులోని చర్చివద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 250 బస్తాలనల్లబెల్లం, 10 బస్తాలపటిక, 40 లీటర్లగుడుంబా గుర్తించి సీజ్ చేశామన్నారు. వాటివిలువ రూ.50.66 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
‘ప్రజలపక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుంది’
మెదక్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలపక్షాన ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఎన్నిదాడులు చేసినా, అక్రమకేసులు పెట్టిజైళ్లకు పంపించినా ప్రజలపక్షాన తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు..
హన్మకొండ: ఫేక్ డాక్యుమెంట్‌తో ప్లాట్ విక్రయానికి కుదుర్చుకుని మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లష్కర్ బజార్‌కు చెందిన సయ్యద్ మసూద్ షరీఫ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మజహర్ హుస్సేన్‌తో 201 చదరపు గజాల ప్లాట్‌కు రూ.44 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.9 లక్షల అడ్వాన్స్ చెల్లించాడు. ప్లాటు స్థలంలో లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రఘునాథపాలెం మండలంలోని కే.వీ.బంజరకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాలోతు రాము, రామ్మూర్తి, శుక్రవారం రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఐని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
ఆ రోజు.. ఖమ్మం మార్కెట్‌కు సెలవు
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా సోమవారం(21న) సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు ఎవరూ కూడా 21 మార్కెట్‌కు సరుకులు తీసుకు రావద్దని కోరారు. తిరిగి మంగళవారం యధాతథంగా పంటల కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
-
వారికి ఉచిత శిక్షణ..
ఖమ్మం: రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాక ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి బి.పురంధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను వచ్చేనెల 18లోగా కలెక్టరేట్‌లోని కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 9704003002 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
-
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జగిత్యాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి తాట్లావాయి శివారులో వెలుగుచూసింది. రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన బెక్కం సాయిలు (65) శుక్రవారం రాత్రి తన పొలం నుంచి ఇంటికి కాలినడన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.