సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని ఎవరెస్ట్ ఎంక్లేవ్ కాలనీలో మిషన్ భగీరథ పైపు పగిలి రోడ్డుపై నీరు వృథాగా పోతుందని స్థానికులు తెలిపారు. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. నీరు వృథా అవుతున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Author: Shivaganesh
-
విప్పలమడకలో చోరీ.. కేసు నమోదు
ఖమ్మం: చోరీ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరా మండలంలోని విప్పలమడకకు చెందిన యడ్లపల్లి మంగయ్య – పద్మావతి దంపతులు రాత్రి ఇంటి తలుపులకు గడియ వేసి ఆరుబయట నిద్రించారు. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుకాల గోడ పైనుంచి లోనికి వెళ్లి బీరువాను ధ్వంసం బంగారు ఆభరణాలు, రూ.65 వేలనగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసినట్లు తెలిపారు.
-
రేషన్ బియ్యం పట్టివేత
మంచిర్యాల: అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ చెప్పారు. కోటపల్లి మండలం రాంపూర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్ సంజయ్‌ని అదుపులోకి తీసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
-
ప్రజా సమస్యలపై మంత్రి మార్నింగ్ వాక్..
సిద్దిపేట: హుస్నాబాద్‌లో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పించారు. పట్టణంలో పెంకుటిల్లు, రేకుల షెడ్లలో ఉంటున్న వారిని గమనించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
-
ఫెయిల్ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య
హన్మకొండ: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెవెన్యూ కాలనీలో చోటుచేసుకుంది. చింతల అక్షయ్(20) అనే విద్యార్థి పాలిటెక్నిక్ మూడవ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈక్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
కరెంట్ షాక్‌తో రైతు మృతి
జయశంకర్ భూపాలపల్లి: కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మల్హర్‌రావు మండలం తాడిచెర్లలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఆకుల ఓదెలు (65) అనే రైతు చేనులో కాయకూరలు కోసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాధం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం కారేపల్లి మండల పరిధిలోని ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారి కొమ్ముగూడెం స్టేజీ వద్ద చోటుచేసుకుంది. మద్దులపల్లికి చెందిన దుగ్గిసూర్యనారాయణ (52) బైక్‌పై ఇల్లెందు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కొమ్ముగూడెం వద్ద ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
జిల్లాకు రానున్న మంత్రి పొన్నం
హన్మకొండ: భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి వివిధ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
హన్మకొండ: హన్మకొండలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అజరా ఆస్పత్రి, ములుగు రోడ్డు, ఎస్పీపీ రోడ్డు, న్యూ కాపువాడ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’
నిర్మల్: బాసర మండలం బిద్రెల్లి గ్రామంలోని రైతులు ఇంకా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఎవరన్నా ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావాలని మండల వ్యవసాయ అధికారి అజయ్ కుమార్ తెలిపారు. పట్టదారు రైతు కేంద్ర ప్రభుత్వం పథకాలు(PM KISAN etc) పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. అన్నదాతలు గమనించి సహకరించాలన్నారు.