మెదక్: వెల్దుర్తి మండలం శేరీల గ్రామంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీసీ, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి మనోహరాబాద్ మండలం దూలపల్లి వద్ద ఐటీసీ పరిశ్రమలో ఎలక్ట్రికల్, సోలార్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 79816-76713, 88977-77504 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Author: Shivaganesh
-
పిడుగుపాటుతో ఒకరి మృతి
జయశంకర్ భూపాలపల్లి: పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మల్హర్ మండలంలో చోటుచేసుకుంది. మల్లారం గ్రామానికి చెందిన కలువల నాగరాజు (22)అనే యువరైతు పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం రాగా, పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
-
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
వరంగల్: పురుగు మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతిచెందిన ఘటన గురువారం పర్వతగరి మండలం ఏనుగల్లులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఎర్రబెల్లి నిర్మల(62) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. బుధవారం గడ్డిమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు హన్మకొండలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గురువారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
ఆటో బోల్తా.. మహిళలకు గాయాలు
ఖమ్మం: ఆటో బోల్తాపడి ఆరుగురు మహిళలు గాయపడిన ఘటన గట్టుసింగారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెంకు చెందిన శ్రీదేవి, పూలమ్మ, మహాలక్ష్మి, మేరమ్మ, పార్వతి కూసుమంచిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో గాయపడ్డారు. వారిని స్థానికులు అంబులెన్స్‌లో నేలకొండపల్లి సీహెచ్సీకి తరలించారు.
-
గంజాయి సీజ్.. ఇద్దరి అరెస్ట్
ఖమ్మం: పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. మహేశ్ ఘోరక్ తాలుంకే(సర్పరాజ్ షేక్), విశాల్ దత్రేయలు ఒడిశాకు వెళ్లి పాండే అనే వ్యక్తిని కలిసి 4కిలోల గంజాయిని తీసుకొని బస్సులో మహారాష్ట్రకు పయనమయ్యారు. ఖమ్మంలో బస్సు దిగిన వారిని రైలు ఎక్కేందుకు వచ్చిన సమయంలో మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
పొక్కుర్‌లో కార్డన్ సర్చ్..
మంచిర్యాల: చెన్నూర్ మండలంలోని పొక్కుర్ గ్రామంలో పట్టణ సీఐ దేవేందర్ రావ్ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 బైక్‌లు, రెండు ఆటోలను సీజ్ చేసి, సుమారు వెయ్యి లీటర్ల గుడుంబా పానకం, 20 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
-
‘ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలి’
సిద్దిపేట: హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాయంలో హుస్నాబాద్ (రూరల్ ) పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. ఇది తాత్కాలిక విరామేనని, ఇక నుంచి విజయమేనని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
-
మెదక్‌లో స్టేట్ బీజేపీ ఛీప్ పర్యటన
మెదక్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడి పర్యటన నర్సాపూర్‌లో మొదలై కౌడిపల్లి, కొల్చారం మీదుగా ఏడుపాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం మంబోజిపల్లి చౌరస్తా నుంచి మెదక్ పట్టణంలో వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
-
జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని మంత్రికి వినతి..
మెదక్: జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డా.వివేక్ వెంకటస్వామికి జిల్లా TNGO, S అధ్యక్షుడు డి.నరేందర్, రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కొత్త జిల్లాలో ఏర్పాటులో భాగంగా జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలపడంతో ఉద్యోగులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.
-
‘ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోండి’
ఆదిలాబాద్: షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి బి.సునీతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-పాస్ వెబ్సైట్లో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం 39 ఏళ్లలోపు న్యాయ శాస్త్ర పట్టభద్రులకు మూడేళ్లపాటు న్యాయ పరిపాలనలో శిక్షణ కోసం నెలకు రూ.3 వేల చొప్పున భృతి, న్యాయశాస్త్ర గ్రంథాలు, ఫర్నీచర్ నిమిత్తం రూ.50వేలు అందజేస్తుందన్నారు.