Author: Shivaganesh

  • ‘ఐటీకి పునాదులు రాజీవ్‌దే’

    మహబాబూబాద్: బయ్యారం మండలం గంధంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ గాంధీదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ

    హన్మకొండ: డీసీసీ భవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • మూడో రోజుకు ఎమ్మెల్యే నిరాహార దీక్ష

    కుమ్రం భీం: సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మూడవ రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నం. 49, పోడు భూముల సమస్యలపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • రాజీవ్ గాంధీకి ఎమ్మెల్యే నివాళి..

    ఖమ్మం: సత్తుపల్లిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సేవలను కొనియడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ‘యూరియా కొరత లేకుండా చూడాలి’

    ఖమ్మం: సత్తుపల్లిలో రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని సీపీఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా యూరియా అందించాలని, ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • రాజీవ్ గాంధీకి ఘన నివాళి..

    మెదక్: దౌల్తాబాద్ పట్టణంలోని బుధవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణ, మండలానికి చెందిన 25 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం అని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

  • నర్సాపూర్ ఏఈఓగా వివేక్ వర్ధన్ రెడ్డి

    మెదక్: నర్సాపూర్ క్లస్టర్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (AEO)గా వివేక్ వర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌడిపల్లి, వెల్దుర్తి, శివంపేట్, చిలపిచెడ్, నర్సాపూర్ మండలాల రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ఉన్నతాధికారులు స్పందించాలి’

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో 15 రోజులుగా చెత్త తొలగించడం లేదని స్థానికులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుత.. వర్షాకాలం కావడంతో దోమలు పెరిగి డెంగ్యూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే చెత్తను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.

  • రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: గండుగలపల్లిలోని అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.