Author: Shivaganesh

  • ఈనెల 20న ఉమ్మడి జిల్లా చదరంగం పోటీలు

    వరంగల్: ఈనెల 20న హన్మకొండ జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధి చిన్నరాముల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టూ ఆల్, అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీలను విద్యుత్తునగర్లోని వంశీ ట్రస్టు భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 99632 14108లో సంప్రదించాలన్నారు.

     

  • ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

    వరంగల్: ఆర్థిక సేవలు, బీమా రంగంలో ఉచిత శిక్షణ – ఉపాధి కోసం జిల్లాలోని మైనార్టీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల అభివృద్ధి అధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 18లోగా దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 040- 23236112 సంప్రదించాలని సూచించారు.

     

  • వారికి శుభవార్త..

    భద్రాద్రి కొత్తగూడెం: రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎంబీబీఎస్ కాలేజీలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఏరియా జీఎం వీసం కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈకాలేజీలో సింగరేణి అధికారులు, ఉద్యోగుల పిల్లలు చదివేందుకు ప్రత్యేకకోటా ఉందని పేర్కొన్నారు. అన్ని సింగరేణి గనులు, విభాగాల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, నీట్ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • మంత్రి సమక్షంలో చేరికలు

    పెద్దపల్లి: ధర్మారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చేరారు. ఖిలవనపర్తి మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రమేష్‌గౌడ్, సాగంటికొండయ్య ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యకర్తలకు మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అయ్యి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

  • ‘మొక్కలు నాటి పరిరక్షణకు కృషి చేయాలి’

    మెదక్: కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం అటవీ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగానే కాకుండా, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటి పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ దీవిశ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

  • ‘అధికారులు నిబద్ధతతో పని చేయాలి’

    మెదక్: జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావ్,ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో నిబద్ధతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని MJP స్కూల్స్, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెదక్ ఆర్సీవో గౌతంకుమార్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 19న సంగారెడ్డిలోని ఆరీసీవో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈడీ, పీజీలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తులకు అర్హులని పేర్కొన్నారు.

     

  • ‘నిబంధనల మేరకే ఇసుక రవాణా’

    ములుగు: తాడ్వాయి డిప్యూటీ తహశీల్దార్ సురేశ్ బాబు, ఎంపీడీవో సుమనవాణి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ గృహ నిర్మాణాల కోసం నిబంధన మేరకే ఇసుక రవాణా జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక రవాణా చేసేందుకు మండలంలో ఏడు ఇసుక రీచ్లను ఏర్పాటు చేశామని అన్నారు. వేబిల్ లేకపోతే వెహికల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.

     

  • విద్యార్థులపై కేసు.. ఎందుకంటే

    మహబూబాబాద్: ప్రిన్సిపల్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదైనట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఇద్దరు విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ప్రిన్సిపల్ మందలించారు. ఈక్రమంలో వారు ప్రిన్సిపల్‌పై దాడి చేయడంతో పాటు దుర్భాషలాడారని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే రౌడీ షీట్ తెరుస్తామపని హెచ్చరించారు.

  • ‘మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి’

    హన్మకొండ: జిల్లా కేంద్రంలో బుధవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధినేత్రి ఆలోచన అధ్యయనం ఆచరణ అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే మహిళలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమావేశంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.