Author: Shivaganesh

  • ‘రెండింటిని ఒకే జిల్లా చేయాలి’

    హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ప్రో. వెంకటనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాను రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ 6 ముక్కలు చేసి అభివృద్ధి చెందకుండా అడ్డుకుందని అన్నారు. చారిత్రాత్మకమైన వారసత్వం ఉన్న వరంగల్, హనుమకొండను ఒకే జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

     

  • నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

    మహబూబాబాద్: సీరోలు మండలం కంపెల్లివస్రం తండాకు చెందిన బానోత్ వీరన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకొని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ వారి ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • రికార్డు సృష్టించిన పత్తి ధర

    వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత రెండు రోజులుగా పత్తి రికార్డు ధరలు సృష్టించాయి. మంగళవారం పత్తికి క్వింటాకు రూ.7,700 పలకగా బుధవారం రూ. 7,750 పలికి రికార్డు నమోదు చేసింది. ఈ విధంగా పత్తి భారీ ధర పలకడం గత ఆరునెలల వ్యవధిలో ఇదే మొదటిసారిని వ్యాపారులు తెలిపారు. దీంతో మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

    వరంగల్: ఆషాఢమాసం షష్టి తిధి పురస్కరించుకుని భద్రకాళి దేవస్థానంలో బుధవారం భద్రకాళి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

  • వరంగల్‌లో చిరుధాన్యాల ధరలు

    వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల చిరుధాన్యాల ధరలు పరిశీలిస్తే.. పచ్చి పల్లికాయకు రూ.4550 ధర రాగా,  క్వింటా సూక పల్లికాయకు రూ.5900 ధర పలికింది. పసుపుకి రూ. 11,958 ధర వస్తే, మక్కలు (బిల్ట్) కి రూ.2,525 ధర వచ్చింది. దీపిక మిర్చి రూ.14వేలు ధర పలికిందని వ్యాపారులు తెలిపారు.

     

  • ‘కార్మికులు శ్రమ దోపిడికి గురి అవుతున్నారు’

    ఖమ్మం: జిల్లా కేంద్రంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో టీయూసీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ పాల్గొని మాట్లాడుతూ.. హామీలను విస్మరించడమే కాక పాలకులు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి దిగజారేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమావేశంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • తగ్గిన నాన్ ఏసీ మిర్చి ధర

    ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఏసీమిర్చి, పత్తి ధర పెరిగితే, నాన్ ఏసీమిర్చి తగ్గింది. మార్కెట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏసీమిర్చి ధర క్వింటా రూ. 14,150, క్వింటా నాన్ ఏసీమిర్చి రూ.8,500 పలికిందన్నారు. క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాటగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  ఏసీ మిర్చి రూ. 150, పత్తి రూ. 50 పెరగగా, నాన్ ఏసీ మిర్చి రూ. 500 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.

     

  • ‘బంద్‌ను జయప్రదం చేయాలి’

    ఖమ్మం: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 23న నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు.

  • పాలీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

    ఖమ్మం: పాలీసెట్ కౌన్సిలింగ్ మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో జిల్లాలోని SR&BJNR డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ జాకీరుల్లా తెలిపారు. కౌన్సెలింగ్‌కు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎలాంటి విరామం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, వివిధ గురుకులాలలో చదివిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

  • ఖమ్మంలో రెండు చెక్ డ్యామ్ల తొలగింపునకు ఆదేశం

    ఖమ్మం: జిల్లాను మున్నేటి వరద ముప్పు నుంచి రక్షించేలా రెండు చెక్ డ్యామ్లను తొలగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులతో పాటు నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేలా చెక్ డ్యామ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మున్నేటిపై ప్రకాశ్‌నగర్, రంగనాయకుల గుట్ట వద్ద చెక్ డ్యామ్లు ఉన్నాయి.