భద్రాద్రి కొత్తగూడెం: కలెక్టర్ జితేష్ వి పాటిల్ ‘నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ అందుకోనున్నారు. ఈ అవార్డును గురువారం ఆయన IIT బాంబేలో జరుగనున్న ‘ఓపెన్ సోర్స్ GIS డే’లో ISRO మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందుకోనున్నారు. గ్రామీణ సమస్యల పరిష్కారానికి జీపీఎస్ సాంకేతికతను వినియోగించి మార్గదర్శకంగా నిలిచినందుకుగానూ ఆయనకు ఈ అవార్డు వరించింది.
Author: Shivaganesh
-
కలెక్టర్‌ను కలిసిన గీత
మెదక్: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా గీత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిషత్ కార్యకలాపాలను జడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. గతంలో సంగారెడ్డి జిల్లా మెప్మా పీడీగా పని చేసిన ఆమె బదిలీపై డిప్యూటీ సీఈఓగా మెదక్ జిల్లా పరిషత్‌కు వచ్చారు.
-
‘రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’
సంగారెడ్డి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109 భూముల సమస్యపై మాజీ మంత్రిని కలిసినట్లు తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
-
నీళ్లు విడుదల చేయాలని ఆందోళన..
సిద్దిపేట: గజ్వేల్ మండలం కొడకండ్ల కెనాల్ వద్ద బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వాగులకు నీళ్లను వెంటనే విడుదల చేసి పంటపొలాలకు నీళ్లందీంచాలని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
ఇసుక లారీ సీజ్.. కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం: అనుమతులు లేకుండా ఇసుక తరలి స్తున్న లారీని పోలీసులు సీజ్ చేసిన ఘటన బూర్గంపాడు మండలంలో జింకలగూడెం
వద్ద చోటుచేసుకుంది. జింకలగూడెం వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ యజమానిపై కేసు నమోదు చేశాన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేడు సిద్దిపేటకు రానున్న మందకృష్ణ మాదిగ
సిద్దిపేట: సిద్దిపేటలో బుధవారం జరిగే దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల లక్ష్మీనారాయణ తెలిపారు. హుస్నాబాద్ విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
-
కాంట్రాక్ట్‌కు దరఖాస్తులు
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని 12 మండలాల్లో తాత్కాలిక పద్ధతిలో పని చేసేందుకు అర్హులైన ఫిజియోథెరపీ వైద్యులు, స్పీచ్ థెరపిస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎం.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోగా నాలుగున్నరేళ్ల బీపీటీ కోర్సు పూర్తి చేసి, రాష్ట్ర పారా మెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని అన్నారు.
-
అప్పు వివాదంతో మహిళ ఆత్మహత్యాయత్నం..
హన్మకొండ: అప్పువివాదంతో ఓమహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో వెలుగుచూసింది. ముల్కనూరుకు చెందిన గుడికందుల రమేష్‌కు 12 ఏళ్ల క్రితం దేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ అప్పు ఇచ్చారు. అప్పు తీర్చకుండా రమేష్ వాయిదాలు వేయడమే కాకుండా, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రశేఖర్ తల్లి, రమేష్ ఇంటి ముందు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
-
దొంగల హల్చల్.. ఒకేరోజు చోరీలు
జనగామ: దొంగలు హల్చల్ చేసిన ఘటన మంగళవారం జనగామ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన నర్సింహరాములు ఇంట్లో, అలాగే సెయింట్‌మేరీస్ హైస్కూల్ సమీపంలోని ఒకరింట్లో, బాలాజీనగర్లోనే తాళం వేసి ఉన్న వాసుదేవరావు ఇంట్లో, జీఎంఆర్ కాలనీలో కూడా ఒకరింట్లో చోరీలు జరిగాయి. చోరీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
దరఖాస్తులకు రేపే ఆఖరు..
జనగామ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు జిల్లాలోని ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు http:///nationalawardstoteachers. education.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి మార్గదర్శకాలు, షెడ్యూల్ వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.