Author: Shivaganesh

  • కూరగాయల సాగుకు రాయితీ

    హన్మకొండ: కూరగాయల సాగుకు రాయితీ అందిస్తున్నట్లు పరకాల డివిజన్ ఉద్యాన అధికారి మధులిక ఒక ప్రకటనలో తెలిపారు. క్యాలీఫ్లవర్,  టమాటా, క్యాబేజీ, పచ్చిమిర్చి నారు 100 శాతం రాయితీపై అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. తీగ జాతి కూరగాయల సాగులో శాశ్వత పందిళ్లు వేసుకునేందుకు 50 శాతం రాయితీ అందిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు 8977714069 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

     

     

  • కేయూలో వాకర్స్‌కు నో ఎంట్రీ 

    హన్మకొండ:  కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి పాదచారులు, ఇతర వాహనాలకు ప్రవేశం రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంపస్‌లో మరమ్మతుల పెరుగుదల సమస్యలు, క్రీడా మైదానం ట్రాక్, పరిసరాల దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో తక్షణమే ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

     

  • కరెంట్ షాక్‌తో ఒకరి మృతి

    మెదక్: కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ (36), రమ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వరిస్తున్నారు. మంగళవారం గ్రామంలోని పొలానికి వెళ్లగా.. మోటారు ఆన్ కాకపోవడంతో స్టార్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు షాక్ గురై మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • రేపు ఉద్యోగ మేళా

    భద్రాద్రి కొత్తగూడెం: ఈనెల 17న నిర్వహించనున్న ఉద్యోగ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖ జిల్లా అధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కొత్తగూడెం ప్రభుత్వ శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే మేళాకు సంబంధిత ధ్రువపత్రాలు, జిరాక్స్ ప్రతులతో ఉదయం 10 నుంచి ముఖాముఖిలకు హాజరుకావాలని సూచించారు.

  • కుక్కల బెడదకు ముగింపు

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కుక్కల బెడద ఎక్కువవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కుక్కల నివారణకు తక్షణ చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ప్రత్యేక నిపుణులను రప్పించి, పట్టణంలో కుక్కలను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

  • కారు బోల్తా.. దంపతులకు గాయాలు

    ఖమ్మం: కారు బోల్తాపడి భార్యాభర్తలకు గాయాలయిన ఘటన మంగళవారం ఖమ్మం గొల్లగూడెం రోడ్డులో చోటుచేసుకుంది. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా గొల్లగూడెం రోడ్డులో వెనక నుంచి మరో మరో కారు ఢీకొంది. దీంతో వారి కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారికి గాయాలు అయ్యాయి. కారును క్రేన్ సహాయంతో తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

  • నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం 

    ఖమ్మం: బల్లేపల్లి సెక్షన్ పరిధిలో బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుం దని ఏడీఈ సంజీవ్ కుమార్ తెలిపారు. మరమ్మతుల కారణంగా బల్లేపల్లి సెక్షన్ పరిధిలోని బాలపేట వ్యవసాయ మోటార్లకు ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

  • ‘మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మెప్మా కృషి చేస్తోంది’

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ సత్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి వారి వ్యాపారాలను అభివృద్ధి చేసే విధంగా మెప్మా కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

  • నీటి సరఫరాలో అంతరాయం

    మెదక్: మెదక్‌లో బుధవారం నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పుర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగూరు నుంచి మెదక్‌కు నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ (పెద్దారెడ్డిపేట వద్ద 1100 ఎంఎం డయా పైపు) లీకేజీ కారణంగా డబ్ల్యూటీపీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా నేడు మెదక్‌కు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణవాసులు గమనించి సహకరించాలని కోరారు.

  • ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

    భద్రాద్రి కొత్తగూడెం: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాల్వంచ మండలం జగన్నాథపురంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన భూక్యా బావ్‌సింగ్ (45), సుశీలకు పదిహేనేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. సోమవారంరాత్రి దంపతుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన బావ్‌సింగ్ సమీపంలో ఉన్న మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.