Author: Shivaganesh

  • షాక్‌కు గురి చేసిన పాము

    భద్రాద్రి కొత్తగూడెం: మోటార్ ఆన్ చేసి నీళ్లు పెడదామని తోటకు వెళ్లిన రైతును ఓపాము షాక్‌కు గురిచేసిన ఘటన దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ రైతు పామాయిల్ తోటకు నీళ్లు పెట్టాలని మోటార్ స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లగా స్టార్టర్ బాక్స్‌ను చుట్టుకొని ఓ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది.

  • ‘ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించవద్దు’

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని మంగళవారం ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నశెట్టి యుగంధర్, బస్టాండ్‌లో పెట్రోల్ బంక్‌ ఏర్పాటుకు అభ్యంతరం తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలంలో బంక్ ఏర్పాటు చేయాలని వారిని కోరారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని అధికారులను కోరారు.

     

  • ఇందిరా పార్క్‌కు తరలిగిన బీఆర్ఎస్ నాయకులు

    సంగారెడ్డి: జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇందిరా పార్క్‌కి తరలి వెళ్లారు. బీసీలకు అధికారికంగా 42% బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకుల పిలుపుమేరకు స్థానిక నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్, జనార్దన్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

  • మహా ధర్నాకు బీసీ నాయకులు

    ఖమ్మం: నేలకొండపల్లి మండలం నుంచి మహా ధర్నాకు పాలేరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ నాయకులు హైదరాబాద్ బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం జరుగుతున్న ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.

  • చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

    మహబూబాబాద్: వరుసగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. మహబూబాబాద్, బయ్యారంల్లో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై తిరుపతి నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. గార్లకి చెందిన సాయి, రవి, రవితేజ, ప్రేమ్ కుమార్, కృష్ణ, హుస్సేన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు సీఐ తెలిపారు.

  • ఘనంగా సింగరేణి 37వ వార్షికోత్సవం

    జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లిలో సింగరేణి సంస్థ 37వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. జులై 15, 1988న ఉమ్మడి AP సీఎం NTR చేత కాకతీయఖని 1A ఇంక్లైన్ గని ప్రారంభమవ్వడంతో సింగరేణి ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం కాకతీయఖని 5, 6, 8వ ఇంక్లెన్ గనులతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు OCP-2,3లతో విస్తరించింది. 3దశాబ్దాలకుపైగా అభివృద్ధిమార్గంలో సాగుతూ, వేలాది మందికి ఉపాధినిస్తూ, భూపాలపల్లి ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

  • ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు

    మహబూబాబాద్: జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు డీఈవో రవీందర్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ముఖ గుర్తింపు విధానం అమలులో అలసత్వం, అలాగే ఇతర కారణాల వల్ల నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ ఒక ప్రకటనలో వెల్లడించారు. నెల్లికుదురు, బయ్యారం, గూడూరు, గంగారం, ఇనుగుర్తి, మహబూబాబాద్, కొత్తగూడ, నరసింహులపేట మండలాల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు నోటీసులు అందాయి.

     

  • ఆటో కార్మికులకు న్యాయం చేయాలని వినతి

    భద్రాద్రి కొత్తగూడెం: ITDA PO రాహుల్‌ను ఆటో యూనియన్ అధ్యక్షుడు మర్మం శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. శంకర్ మాట్లాడుతూ.. కూనవరం- చింతూరు రోడ్డులోని ఆటో కార్మికుల స్టాండ్ ఆక్రమించి సుమారు 200ఆటో కార్మికుల కుటుంబాల బతుకు దెరువును దెబ్బతీస్తూ భవనాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో  శ్రీను, కోటేశ్వరరావు, కృష్ణ, వీరభద్రం పాల్గొన్నారు.

  • నిరుద్యోగులకు శుభవార్త

    భద్రాద్రి కొత్తగూడెం: ఐటీసీ ప్రథమ్ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిషన్, బ్యూటీషియన్, నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, మెకానికల్, డీఈవో కోర్సులు ఉన్నాయన్నారు. ఉచిత భోజన వసతితో 45 రోజుల శిక్షణ ఉంటుందన్నారు.  ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి..

    ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 600 ఆలయాలున్నాయి. ఈఆలయాలకు 18 ఈవో పోస్టులు కేటాయించాగా, ప్రస్తుతం 11 మంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాల పర్యవేక్షణకు ఈవోల కొరత ఏర్పడింది. ఉన్న వారిపై అదనపుభారం పడటంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,771 ఎకరాల ఆలయభూములు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. వెంటనే ఖాళీగా ఉన్న 7 పోస్టులను భర్తీచేయాలని భక్తులు కోరుతున్నారు.