భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండల మోరంపల్లి బంజర జడ్పీహెచ్ పాఠశాల ఉపాధ్యాయుడు తేజావత్ మోహన్ జాతీయస్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. ఇటీవల రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో ఆయన ఉత్తమప్రదర్శన కనబరిచిన సందర్భంగా జాతీయస్థాయి శిక్షణకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి 10 మందిని ఎంపిక కాగా వారిలో బూర్గంపాడు మండలం నుంచి తేజావత్ మోహన్ ఎంపిక కావడం విశేషం.
Author: Shivaganesh
-
షీటీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన
వరంగల్: వరంగల్లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థినులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా షీటీం ఇన్‌స్పెక్టర్ సుజాత పాల్గొని మాట్లాడుతూ.. ఆకతాయిలు ఎవరైనా బాలికలను వేధిస్తే షీ టీంకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాల వినియోగ ప్రమాదాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొన్నారు.
-
41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు
హన్మకొండ: కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 41కి పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 37 మందితో పాటు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి కోర్టు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేదంటే జరిమానా తప్పదని వాహనదారులు సీఐ హెచ్చరించారు.
-
కేయూలో పుస్తకావిష్కరణ
హన్మకొండ: కేయూ SDLCE ప్రాంగణంలో బహు జనగణమన పుస్తకా విష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేయూ పాలకమండలి సభ్యులు రాజుగౌడ్, బహుజన రచయితల సంఘం కన్వీనర్ సదాశివ్, బీసీ సంఘం నేతలు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా వారు మహాత్మా జ్యోతిబాఫులే సావిత్రిబాయి విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన DEET Portalతో పరిశ్రమల్లో ఖాళీగా ఉన్న 160 ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు www.deettelangana.gov.in వెబ్సైట్‌ను సందర్శించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విజువల్ ఇన్‌స్పెక్టర్, RAD, QC, QA, ట్రైనీ వంటి వివిధ ఉద్యోగాలకు ITI ఆపైన చదువుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.
-
తల్లిదండ్రుల గొడవలో చిన్నారి మృతి
మెదక్: తల్లి చేతిలో నుంచి కిందపడి ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శివంపేటలో చోటుచేసుకుంది. సేమ్‌పేట గ్రామానికి చెందిన కుంట మహేష్ లావణ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈనెల 5న భోజనం వడ్డించలేదని భార్యపై మహేష్ దాడి చేయగా, లావణ్య చేతిలోంచి రెండవ బిడ్డ ఆకాంక్ష జారిపడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందింది.
-
బంధువుల చెంతకు తప్పిపోయిన చిన్నారి
సిద్దిపేట: తప్పిపోయిన చిన్నారిని పోలీసులు బంధువుల చెంతకు చేర్చారు. సిద్దిపేటలోని కరీంనగర్ రోడ్డులో చిన్నారి దివ్య (4) సోమవారం మధ్యాహ్నం తప్పిపోయి ఏడుస్తూ కనిపించింది. దీంతో చిన్నారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేసి వారి పెద్దనాన్న అర్జున్‌కు అప్పగించినట్లు టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. సోషల్ మీడియాలో సాయంతో పాప బంధువులు తమను సంప్రదించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
-
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి: గ్రూప్- 1, 2, 3, 4, RRB, బ్యాంకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణ కోసం ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకు సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు www.tsbcstudycircle. cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు 08455-277015 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
-
దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి: స్వయం ఉపాధి, పునరావాసం కోసం జిల్లాలోని దివ్యాంగులు ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి మల్లీశ్వరి తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను మున్సిపల్ పరిధి వారు మున్సిపల్ కార్యాలయంలో, మండలాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలన్నారు. రుణాలను సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 96523 11804 నంబర్ సంప్రదించాలని సూచించారు.
-
సూసైడ్ ఘటనలో నలుగురి అరెస్ట్
హన్మకొండ: వైద్యురాలు ప్రత్యూష సూసైడ్ ఘటనలో హాసన్‌పర్తి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలో ప్రత్యూష భర్త సృజన్, అత్తమామలు పుణ్యవతి, మధుసూదన్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ శృతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నలుగురిపై వేధింపులు, అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిని నేడు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.