Author: Shivaganesh

  • దరఖాస్తుల గడువు 17 వరకు పొడిగింపు

    సిద్దిపేట: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2025 పొందేందుకు దరఖాస్తుల గడుపును పొడిగించినట్లు డీఈవో శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ లోపు http:///nationalawardstoteachers.educa-tion.gov.in సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ప్రతులను ఈనెల 19వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

    భద్రాద్రి కొత్తగూడెం: దివ్యాంగుల ఆర్థిక ప్రోత్సాహక పథకంలో భాగంగా జిల్లాలోని దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు అవసరమైన రుణాలు ఇస్తామని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 63019 81960 నంబర్ సంప్రదించాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • పీర్ల పండుగ పోస్టర్ ఆవిష్కరణ

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో ఈనెల 17, 18, 19 తేదీలలో పీర్ల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం జాతరకు సంబంధించిన పోస్టర్‌ను సీజీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • దరఖాస్తులకు గడువు పెంపు

    భద్రాద్రి కొత్తగూడెం: ఈనెల 17వ తేదీ వరకు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు డీఈఓ  ఎం.వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జడ్పీ, ప్రభుత్వ, ఏఈఈఎస్, ఏకలవ్య పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన  ఉపాధ్యాయులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని, ధ్రువపత్రాలను అదే రోజు విద్యాశాఖ కార్యాలయంలో సమర్పిం చాలని సూచించారు.

  • ‘మొహర్రం మత సామరస్యానికి ప్రతీక’

    సంగారెడ్డి: ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామంలో మొహ‌ర్రం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావ్ ఉత్సవాల్లో పాల్గొన్ని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొహ‌ర్రం మత సామరస్యాలకు ప్రతీక అని అన్నాారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

  • ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

    సంగారెడ్డి: నిజాంపేట్ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మిని బాలికల గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తించేందుకు కుక్, ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోగా గిరిజన మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను గురుకులంలో సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 7981090652 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    వరంగల్: నర్సంపేట పట్టణంలోని మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తా మని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం అధికార వెబ్సైట్ https://www. gmcnspt.com లో చూడాలని కోరారు.

     

  • గుండెపోటుతో విద్యార్థి మృతి

    హన్మకొండ: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ధర్మసాగర్ మండలం కరుణాపురంలో వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మహాత్మా జ్యోతిభాపులె బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో ఇంటర్ విద్యార్థి బత్తిని మణితేజ్ (17) ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం మైదానంలో పరుగెత్తి వచ్చి కూర్చుని కిందపడిపోయాడన్నారు. ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  • అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

    ములుగు: వాజేడు మండలం, గణపురం శివారులో ఉనక బస్తాల కింద టేకు దుంగలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో జరిపిన దాడిలో రూ.1.30 లక్షల విలువైన ఎనిమిది టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వస్తున్నారని గమనించిన డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. బొలెరో వాహనాన్ని, టేకు దుంగలను వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు.

  • లేఖ విడుదల చేసిన మావోలు

    భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు లేఖ మంగళవారం లేక విడుదల చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓ సంవత్సర కాలంలో 357 మంది మావోయిస్టును కోల్పోయామని లేఖలో తెలియజేశారు. అందులో 136 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. చనిపోయిన మావోయిస్టుల్లో నలుగురు సిసి సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ మావోయిస్టులు ఉన్నారని తెలిపారు.