మెదక్: రామాయంపేటలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలోని విగ్నేశ్వర ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు, సాయంత్రం విఘ్నేశ్వరుడికి పంచామృతలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజలు చేశారు. స్వామివారికి దీపా ధూపం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
Author: Shivaganesh
-
30 కిలోల గంజాయి సీజ్.. కేసు నమోదు
ఖమ్మం: 30 కిలోల గంజాయి సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సభ్యులు తెలిపారు. నగరంలోని ఆర్టీసీ
బస్టాండు వద్ద ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించింది. ఈక్రమంలో ప్రాంగణానికి సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న మూడు సంచులను పరిశీలించగా అందులో 30 కిలోల గంజాయి లభ్యం అయ్యింది. కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం: ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో గ్రూపు-1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు ఈనెల 16 నుంచి ఆగస్టు 11వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం అందిస్తామన్నారు.
-
మొక్కలు నాటిన అధికారులు
మెదక్: రామాయంపేట మండల కేంద్రంలో వనమహోత్సవం కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు.
-
నియామక పత్రాలు అందజేసిన వీసీ
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల (కో- ఎడ్యుకేషన్) విద్యార్థులు హైదరాబాద్‌లోని క్యూ స్పైడర్ సంస్థలో ప్రాంగణ నియామకాలు పొందినట్లు నియామకాల సంచాలకులు చిర్ర రాజు తెలిపారు. సోమవారం ఉపకులపతి ఆచార్య ప్రతాప్రెడ్డి విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. రూ.3.60లక్షల వార్షిక వేతనంతో 52 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
-
కల్లూరులో పర్యటించిన ఎమ్మెల్యే
ఖమ్మం: కల్లూరు మున్సిపాలిటీలో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించారు. ఈసందర్భంగా ఆమె ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె అధికారులతో ప్రజల సమస్యలు మాట్లాడి అక్కడికక్కడే వారికి న్యాయం చేస్తూ డోర్ టూ డోర్ సర్వీస్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
-
నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతి
మెదక్: ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్‌ను సోమవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు కలిసి వినతి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సింగూర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి వరినాట్లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-
పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే
సంగారెడ్డి: నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గేట్ దగ్గరలోని విశాఖ కార్యాలయంలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ స్వరూప్, తదితరులు ఉన్నారు.
-
అంగన్‌వాడీ కేంద్రంలో పాము కలకలం
మెదక్: అంగన్‌వాడీ కేంద్రంలో పాము కలకలం రేపిన ఘటన సోమవారం రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని దామర చెరువు బీసీ కాలనీలోని అంగన్‌వాడీలో సోమవారం ఉదయం నాగుపాము కనిపించింది. పామును చూసి సిబ్బంది వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. ఆ సమయంలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
-
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు
మెదక్: ఆటో బోల్తాపడి ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. రామాయంపేట నుంచి ప్రయాణికులను తీసుకొని మెదక్ వెళ్తున్న ఓఆటో శమ్నాపూర్ వద్ద కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను రామాయంపేట 108 సిబ్బంది మెదక్ ఆస్పత్రికి తరలించారు.