Author: Shivaganesh

  • రహదారిపై గుంత పూడ్చాలి..

    సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట వెళ్లే ప్రధాన రహదారిపై వారం రోజుల క్రితం భగీరథ పైపులైన్ మరమ్మతుల కోసం గుంతతీశారు.  మరమ్మతు పనులు చేసినప్పటీకి అసంపూర్తి పనుల వల్ల లీకేజీ కావడంతో గుంతపూడ్చకుండా వదిలేశారు. సోమవారం పలువురు స్థానికులు, వాహనదారులు మాట్లాడుతూ.. రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే గుంతను పూడ్చాలని అధికారులను కోరారు.

  • ఆర్మీ జవాన్ మిస్సింగ్..

    మహబూబాబాబ్: ఓ ఆర్మీ జవాన్ మిస్సింగ్ అయిన ఘటన మరిపెడ మండలం గిరిపురం గ్రామం పూసల తండాలో వెలుగుచూసింది. తండాకు చెందిన నవీన్ ఆర్మీ జవాన్. తాను డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ఆయన డ్యూటీలో జాయిన్ కాలేదు. ఆయన కారు శ్రీశైలం డ్యాం వద్ద లభించగా, అందులో సెల్ ఫోన్ , ఖాళీ పురుగుమందుల డబ్బా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

  • భవానిమాతకు ప్రత్యేక పూజలు

    సంగారెడ్డి: సదాశివపేట గురునగర్ కాలనీలోని శ్రీ భవాని మాత ఆలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అమృతాభిషేకాలు ,కుంకుమార్చన, హోమం, వంటి క్రతువులు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

  • అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

    మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2025కు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO రవీందర్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(సెప్టెంబర్ 5)ని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు https:nation alawardstoteachers.education.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

    వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం సోమవారం పునఃప్రారంభమైంది. ఈక్రమంలో మార్కెట్‌కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయినా పత్తి ధర మాత్రం భారీగానే పలికినట్లు పేర్కొన్నారు. గతవారం గరిష్ఠంగా క్వింటా పత్తి ధర రూ.7,500 పైగా పలకగా.. నేడు రూ.7,505 పలికింది.

  • తెలంగాణ ఉద్యమకారుడు కన్నుమూత

    మహబూబాబాద్: తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారుడు, మహబూబాబాద్‌కు చెందిన గుంజె హన్మంతు సోమవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన తన నివాసంలో కన్నుమూశారు. హన్మంతు మరణంపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత సంతాపం తెలిపారు. స్వరాష్ట్ర సాధనకై హన్మంతు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు గుర్తు చేశారు.

  • రేపు కలెక్టరేట్‌లో సమావేశం..

    మహబూబాబాద్: కలెక్టరేట్లో మంగళవారం ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి దిశా సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, సంబంధిత అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

  • జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలాలు

    వరంగల్: యాసంగి పంట చేతికి రావడంతో నీటి వినియోగం తగ్గిన కారణంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. జూన్ చివరి నాటికి హన్మకొండ జిల్లా భూగర్భ జలాల మట్టం సగటు మే నెలలో 8.55లోతులో ఉండగా, జూన్లో 8.37 మీటర్లకు పెరిగింది. వరంగల్‌లో మేనెలలో 6.14 మీ. లోతులో ఉండగా జూన్ చివరినాటికి 5.98 మీ.కు పెరింగింది.

  • స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

    ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీమిర్చి ధర రూ. 13,850, క్వింటా నాన్ ఏసీ మిర్చి రూ.8,800, క్వింటా పత్తి ధర రూ.7,825 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీసభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోల్చితే ఏసీమిర్చి ధర రూ.350, నాన్ ఏసీ మిర్చి రూ.300, పత్తి ధర రూ.75 పెరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

  • సాగునీరు విడుదల చేసిన మంత్రులు

    ఖమ్మం: జిల్లాకు సాగు నీటిని అందించాలనే లక్ష్యంతో పాలేరు నుంచి రెండవ జోన్‌కు సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు. ముందుగా వారు పాలేరు ఆకుట్ పాల్‌గేట్ల వద్ద ప్రత్యేకపూజలు చేసి, స్వీచ్ ఆన్ చేసి దిగువకు నీరు వదిలారు. మొత్తం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.