భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం గోదావరి వంతెనను 1965 జులై 13న నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ వంతెన ఆదివారంతో 60 ఏండ్లు పూర్తి చేసుకుంది. దీనిని ముంబాయికి చెందిన ఓ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించారు. దీన్ని 3,934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కొక్క పిల్లరు మధ్య 106.6 అడుగుల దూరంతో నిర్మించారు. 1986లో 75.60 అడుగులు, 2022లో 71.30 అడుగుల వరదొచ్చినా తట్టుకొని ఈ వంతెన నిలబడింది.
Author: Shivaganesh
-
దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు మల్హర్ మండల కేంద్రం తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హెచ్ఎం తిరుపతిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కులం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫొటోలు ఇవ్వాలని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు నంబర్ 94924 40030 సంప్రదించాలని పేర్కొన్నారు.
-
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఖమ్మం: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మార్తి ముత్తమ్మ (44) అనే మహిళ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
ఐదు ఇసుక ట్రాక్టర్ల సీజ్
జయశంకర్ భూపాలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్లగ్రామ శివారులోని చలివాగు నుంచి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో రంగాపురం శివారులో పట్టుకుని ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
అక్రమ నిర్మాణాలు.. అధికారుల తీరుపై అనుమానాలు
సంగారెడ్డి: గడ్డపోతారం మున్సిపాలిటీలోని అల్లినగర్, తెలంగాణ కాలనీ సర్వే నంబర్ 27లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా నిర్మాణాలు ఆగకపోవడంతో సంబంధిత అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అధికారులు మొక్కుబడిగా కూల్చివేతలు చేపట్టినా, తిరిగి నిర్మాణాలు జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది.
-
తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మం: తిరుమలాయపాలెం మండలంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. మండలంంలోని అజ్మీరతం, డా.జల్లెపల్లి, హైదరాసాయిపేట, సుబ్లేడు గ్రామాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
-
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట: దుబ్బాక మండలంలోని షేర్‌పల్లి బందారంలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల పాఠశాలలో అతిథి అధ్యాపక, ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కరుణ ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, పీజీ పూర్తిచేసిన మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 79934 56685ను సంప్రదించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
-
ఆదర్శంగా నిలుస్తున్న అంగన్‌వాడీ టీచర్
భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం రెండో అంగన్‌వాడీ కేంద్రం ఆకట్టుకుంటుంది. చిన్నారులను కేంద్రం వైపు మళ్లించేందుకు టీచర్ కుంజా ఏసుకుమారి చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. భవనం గోడలకు రూ.17,500 సొంత ఖర్చుతో ఆకట్టుకునే చిత్రాలు, విజ్ఞానాన్ని పంచేలా బొమ్మలు వేయించారు. ప్రస్తుతం కేంద్రంలో 28 మంది పిల్లలు, కిశోర బాలికలు 11 మంది, ఐదుగురు గర్భిణులు ఉన్నారని టీచర్ వెల్లడించారు.
-
ఇంటి మెట్లు కూలి బాలుడి మృతి
వరంగల్: ఇంటి మెట్లు కూలి బాలుడు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అర్షమహేందర్- సునీత దంపతుల కుమారుడు అనుదీప్ (13) గ్రామంలోని బీరన్నగుడివద్ద మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఈక్రమంలో బాల్ సమీపంలోని షేక్‌ఇమామ్ ఇంటి సమీపంలో పడగా, తీసుకురావడానికి వెళ్లిన అనుదీప్‌పై ఒక్కసారిగా ఇంటి మెట్లు కూలి పడగా.. అక్కడికక్కడే మృతి చెందాడు.
-
ఈ వాల్ పోస్టర్లు చూశారా!
ములుగు: వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ – తెలంగాణ పేరిట వాల్‌పోస్టర్లు వెలిశాయి. “మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి ఆశాకిరణం ఎన్నడైంది?” అని ప్రశ్నిస్తూ, 40 ఏళ్ల ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడువారినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు అగ్ర నాయకులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి, ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చి, ఆయుధాలు విడిచి ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.