జనగామ: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన జఫర్‌గఢ్ మండలం సాగరమునలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏరువా ముకుందరెడ్డి (55) ఈనెల 5న రేగడి తండా శివారు టీబీతండా సమీపంలో అర్ధరాత్రి బైక్‌పై నుంచి పడితీవ్రంగా గాయపడ్డారు. ఆయనను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Author: Shivaganesh
-
సత్తుపల్లి నూతన సీపీఐ కార్యదర్శి ఎన్నిక
ఖమ్మం: సీపీఐ పార్టీ సత్తుపల్లి మండల కార్యదర్శిగా తడికమల్ల యోబు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయనకు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం తడికమల్ల యోబు మాట్లాడుతూ.. 15 మంది కౌన్సిల్ సభ్యులు, 9 మంది కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. తమ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
-
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
జనగామ: రోడ్డు ప్రమాదంలో ఓయువకుడికి గాయాలైన ఘటన ఆదివారం దేవరుప్పుల మండలం గొల్లపల్లి శివారులో చోటుచేసుకుంది. గొల్లపల్లి శివారులో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్‌ట్రాలీ చక్రం మరమ్మతులకు గురికావడంతో రోడ్డుమధ్యలో ఆపి ఎలాంటి సంకేతాలను ఏర్పరచకుండా వదిలేశారు. గ్రామానికి చెందిన బట్ట రమేష్ మొండ్రాయి నుంచి స్వగ్రామానికి వస్తుండగా దానిని గమనించకుండా ఢీకొనడంతో ప్రమాదానికి గురైయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
పాలేరుకు సాగర్ జలాలు నిలిపివేత
ఖమ్మం: నాగార్జున సాగర్ నుంచి కూసుమంచి మండలం పాలేరుకు విడుదలు చేసిన నీటిని NSP అధికారులు సోమవారం నిలిపివేశారు. సాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి పాలేరుకు 1 టీఎంసీ నీటిని విడుదల చేశారు. గత వారం రోజులగా నీరు రావడంతో పాలేరు జలాశయం నిండింది. ఈక్రమంలో నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
-
ముస్లాపూర్‌లో కార్డన్ సెర్చ్
మెదక్: అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో సోమవారం పోలీసుల కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ డి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని 60 బైక్‌లు, 4 ఆటోలు, 2 బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
షార్ట్ సర్య్కూట్‌తో ఇల్లు దగ్ధం
సంగారెడ్డి: షార్ట్ సర్య్కూట్‌తో ఇల్లు కాలిపోయిన ఘటన సోమవారం నారాయణఖేడ్ మండలం అబ్బెద గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్య్కూట్ సంభవించి ఇల్లు కాలిపోయింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితులు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అయ్యారు.
-
రెండు ఆలయాల్లో చోరీ.. కేసు నమోదు
సంగారెడ్డి: రెండు ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ఘటన సోమవారం కంగ్టి మండలం దేగుల్వాడి గ్రామంలోని వెలుగుచూసింది. స్థానిక భవానిమాత, రాంమందిర్ ఆలయాల్లో నుంచి అమ్మవార్ల తాళిబొట్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. చోరీ ఘటనపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
ఈ ప్రాంతాల్లో రెండు రోజులు నీళ్లు బంద్
మెదక్: సంగారెడ్డి,మెదక్ జిల్లాలో పలు చోట్ల మంగళ, బుధవారాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావని ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ జిల్లా పెద్దారెడ్డిపేట గ్రామ సమీపంలో డయా పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడిన కారణంగా నీళ్ల సరఫరా బంద్ అయ్యిందని వెల్లడించారు. లీకేజీకి మరమ్మతులు చేపట్టిన అనంతరం సరఫరా ఉంటుదన్నారు. మెదక్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.
-
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి
భద్రాద్రి కొత్తగూడెం: కలెక్టరేట్‌లో సోమవారం సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల ప్రజలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో పాల్గొని వారి సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఉదయం 10 గంటల వరకు కలెక్టరేట్లో ఉండాలని ఆదేశించారు.
-
వైభవంగా బోనాల పండుగ
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణం హమాలీ కాలనీలో ఆదివారం వైభవంగా బోనాల పండుగ నిర్వహించారు. స్థానికంగా ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి మహిళలు డప్పు చపులు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీసభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం అదృష్టమని, అమ్మవారి ఆశీస్సులతో అందరు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.