Author: Shivaganesh

  • విద్యుత్తు వినియోగదారులకు గమనిక

    హన్మకొండ: వడ్డేపల్లి, కలెక్టరేట్ సబ్ స్టేషన్ల పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ హన్మకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సబ్‌స్టేషన్ పరిధిలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాపారులు, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

     

  • ‘నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నాం’

    మెదక్: పాపన్నపేట మండలం పొడిచాన్‌పల్లి సబ్ స్టేషన్‌ను ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
    రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విద్యుత్తు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • వైద్య సిబ్బంది పనితీరు బేష్: కలెక్టర్

    మెదక్: పాపన్నపేట మండలం పొడిచాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పీహెచ్‌సీలోని హాజరు పట్టికను పరిశీలించి, ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు, మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బంది పనితీరు బేష్‌గా ఉందని కొనియాడారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

     

  • ‘బుద్ధునితో నా ప్రయాణం’ ఆకట్టుకుంది..

    హన్మకొండ: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటక ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకొంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి సహకారంతో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో నృత్య రూపక ఉచిత నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో లతరాజా ఫౌండేషన్ ఛైర్మన్ కేకే రాజు, బీఎస్ఐఐ రాష్ట్ర అధ్య క్షుడు పరందాములు, పెద్ద సంఖ్యలో వీక్షకులు పాల్గొన్నారు.

  • నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం 

    ఖమ్మం: చెట్లకొమ్మల తొలగింపు కారణంగా గాంధీచౌక్ ఉపకేంద్రం శివాలయం పీడర్ పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ క్రాంతిసింహ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు తహసీల్దారు కార్యాలయం, సాయిరాం థియేటర్, వీరాంజనేయ స్వామిగుడి, కాల్వొడ్డు, మోతీనగర్, రంగనాయకుల గుట్ట, గాంధీనగర్, ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

     

     

  • నేడు గిరిజన దర్బారు

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం ఉదయం 10.30 గంటలకు గిరిజన దర్బారు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. మన్యంలోని గిరిజనులు గిరిజన దర్బారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందించాలని చెప్పారు. సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.

  • ‘జిల్లాలో ఎరువుల కొరత లేదు’

    మెదక్: పాపన్నపేట మండలం లక్ష్మీనగరం గ్రామంలో ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న ఎరువుల దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.

  • విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    వరంగల్: ఖిలా వరంగల్ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ ఎస్.మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా మధ్యకోట, పడమరకోట, తూర్పుకోట, చింతల్, ఆదర్శ నగర్ ప్రాంతాల్లో ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

  • గ్రేటర్లో ప్రజావాణి రద్దు

    వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పరిపాలనమైన కారణాల దృష్ట్యా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ ప్రజలందరూ విషయాన్ని గమనించి ప్రజావాణి అర్జీలను అందజేయడానికి గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయానికి రావద్దని సూచించారు.

     

     

  • నేడు కలెక్టరేట్లో ప్రజావాణి

    వరంగల్: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.  ప్రజావాణిలో జిల్లా ప్రజలు పాల్గొని తమ సమస్యలపై అర్జీలను అందజేయాలన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.