మెదక్: మెదక్ మండలం పేరూరు గ్రామంలో ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్తు సరఫరా గురించి, యూరియా అందుబాటు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం చింతకానిలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.30కు చింతకాని చేరుకొని అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
-
క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉభయ నదులు 7.800 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద తగ్గడంతో 2,89,710 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైందన్నారు. బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు.
-
‘ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శం’
సంగారెడ్డి: ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శం అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఆదివారం పిచేర్యాగడి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు పట్లోళ్ల సురేష్ పదవి విరమణ అభినంద సభను ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, సురేష్‌ను సన్మానించి మాట్లాడారు. పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమేనని అన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
-
‘రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి’
సంగారెడ్డి: కోహీర్ మండలం భరత్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఇండియన్ స్కూల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఎంపీని కలిసిన భాగ్యరాజ్
మెదక్: ఎంపీ రఘునందన్ రావును ఆదివారం వారి నివాసంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో సేవ చేయడానికి తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నట్లు తెలిపారు.
-
చోరీకి గురైన ఫోన్ అందజేసిన పోలీసులు
సంగారెడ్డి: ఫోన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్‌రోడ్ వద్ద ఉన్న మొబైల్ షాప్లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి రూ. 22,000 విలువైన మొబైల్ ఫోన్ను అపహరించి పరారయ్యాడు. యజమాని షాఫీక్ ఫిర్యాదు మేరకు ఖేడ్ ఎస్సై విద్య చరణ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. ఆదివారం బాధితునికి ఫోన్‌ను తిరిగి అప్పగించారు.
-
ఎన్‌హెచ్‌ఆర్సీ వైస్ ఛైర్మన్‌గా బాలకృష్ణ
కరీంనగర్: జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ రూరల్ వైస్ ఛైర్మన్‌గా కాంపెల్లి బాలకృష్ణ నియమితులయ్యారు. నేషనల్ చైర్మన్ మహమ్మద్ యాసిన్ ఆదేశాల మేరకు సంఘం జిల్లా ఛైర్మన్ తలకొక్కుల సదానందం ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సంస్థ విధి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని అవినీతిపై పోరాటం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
‘లక్ష్యం దిశగా విద్యార్థులు ఏకాగ్రతతో కృషి చేయాలి’
కరీంనగర్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సౌకర్యాలు మెరుగుపడ్డాయని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులు లక్ష్యం దిశగా పట్టుదల, ఏకాగ్రతతో కృషి చేయాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని టీచర్లకు పిలుపునిచ్చారు.
-
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే
పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణం తెనుగువాడలోని శ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మహిళలు, భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. అమ్మవారిని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.