పెద్దపల్లి: ముత్తారం గ్రామానికి చెందిన ఇనుముల ఉప్పలయ్య ఇటీవల హైపోక్సియా అనే శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయను వివిధ పరీక్షల అనంతరం వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి RMO డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు శ్రావణ్, సుమలత, లహరి, నాయన, డెంటల్ బృందాన్ని ఆయన అభినందించారు.
Author: Shivaganesh
-
భగ్గుమన్న బోడకాకర ధరలు.. కిలో రూ.350
ఖమ్మం: జిల్లాలో బోడకాకరకు ధరలు భగ్గుమన్నాయి. మార్కెట్లో ప్రస్తుతం బోడ కాకరకాయలు కిలోకు రూ.320 నుంచి రూ.350 వరకు పలుకుతున్నాయని కొనుగోలుదారులు తెలిపారు. రైతుబజార్లలో బోర్డులపై ధర రూ. 280గా ప్రదర్శించినా, వాస్తవంగా అమ్మకాలు మాత్రం పెరిగిన రేట్లకే జరుగుతున్నాయని తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి వస్తున్న సరఫరాతో పాటు, లభ్యత తగ్గిన నేపథ్యంలో ధరలు పెరిగాయని అభిప్రాయ పడుతున్నారు.
-
లారీ ఢీకొని యువకుడి మృతి
ఖమ్మం: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం (మం) చంద్రుతండాకు చెందిన బానోత్ కుమార్ (24) ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. డ్యూటీ అనంతరం బైకుపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
నేడు బీఆర్ఎస్ నాయకుల సమావేశం
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో MLC రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ MLA శంకర్ నాయక్ హాజరు కానున్నారు. సమావేశంలో BC రిజర్వేషన్స్ అంశం, రైతు సమస్యలపైన చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
-
బాధిత కుటుంబానికి స్నేహితుల అండ..
కరీంనగర్: తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన న్యాలం హరీష్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందారు. మృతి చిన్ననాటి స్నేహితులంతా కలిసి రూ.75 వేలు జమచేసి ఎల్ఎండీ కాలనీ పోస్ట్ ఆఫీస్‌లో హరీష్ కుటుంబసభ్యుల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ బాండును ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో సైతం హరీష్ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.
-
రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు
మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాయరావు చెరువు వద్ద ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ఐదవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో సాయంకాలం సామూహిక బోనాలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు పేర్కొన్నారు.
-
దీప్తిని అభినందించిన ఎమ్మెల్యే
వరంగల్: వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు కల్లెడ క్రీడాకారిణి జీవాంజి దీప్తిని అభినందించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఎంపిక పోటీల్లో ఆమె 400 మీటర్ల పరుగులో పాల్గొని 56.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఆమె ప్రపంచ పారా ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
-
పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న రోడ్ సెంటర్ డివైడర్ పనులను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివైడర్ పనులు పూర్తి అయిన తర్వాత మొక్కలు నాటాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో మొక్కలు నాటితే అవి బతుకుతాయని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
‘మూగజీవాలకు వైద్యం అందడం లేదు’
భద్రాద్రి కొత్తగూడెం: పశు వైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అశ్వారావుపేట మండలం సున్నంబట్టి రైతులు వాపోయారు. వైద్యశాల తరచుగా మూసి ఉండటంతో మూగజీవాలకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాకలగూడెం, తిరుమలకుంట, దురదపాడు వంటి గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు వైద్యులు అందుబాటులో ఉండి మూగజీవాలకు మెరుగైన చికిత్సలు అందించాలని కోరుతున్నారు.
-
‘రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి’
భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేటలో రెండేళ్లుగా జరుగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రజలకు తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి. వర్షాలకు బురద, ఎండలకు దుమ్ముతో పాటు, రోడ్డు పక్కన గుంతలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈనేపథ్యంలో రద్దీ తగ్గి తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోయారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.