మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన గాయంతి శ్రీకాంత్(21) శనివారం తన వ్యవసాయ పొలం వద్ద భూమి చదును చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
Author: Shivaganesh
-
‘మంచి విద్య అందించడమే లక్ష్యం’
మెదక్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల, వసతి గృహాన్ని కలెక్టర్ కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.21 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. విద్యార్థులకు మంచి విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం, భోజనం అందించడమే లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
పెద్దచికోడులో కనువిప్పు కార్యక్రమం
సిద్దిపేట: దుబ్బాక మండలం పెద్దచికోడు గ్రామంలో శనివారం రాత్రి పోలీస్ కళాకారుల బృందం ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎస్సై కీర్తిరాజు పాల్గొని మాట్లాడుతూ.. మూఢనమ్మకాలపై ప్రజలు అపోహలు విడాలన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. కార్యక్రమంలో పోలీస్ కళాకారుల బృందం, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘నాణ్యమైన వైద్యం అందించాలి’
మెదక్: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను DCHS శివదయాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి, పలు రికార్డులను తనిఖీ చేశారు. మందుల నిల్వలు పరిసరాల పరిశుభ్రత గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
-
విద్యుత్తు సరఫరా నిలిపివేత
జగిత్యాల: మెట్పల్లి పట్టణంలో ఆదివారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు పట్టణ- 2 ఏఈ రవి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కళానగర్, దోబీఘాట్, సుల్తానుర, రాంనగర్, ఆదర్శనగర్, ఇందిరాప్రియదర్శికాలనీ, దుబ్బవాడ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉందన్నారు. సారంగాపూర్ మండలంలో ప్రధానలైను మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అన్ని గ్రామాలకు సరఫరా నిలిచిపోనుందని ఏఈ ప్రవీణ్ తెలిపారు.
-
జగిత్యాలలో విద్యుత్తు సరఫరా బంద్
జగిత్యాల: జగిత్యాల గ్రామీణ మండలంలో ఆదివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్తు మరమ్మతుల కారణంగా హబ్సీపూర్, సోమనపల్లి ఫీడర్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, రైతులు గమనించి విద్యుత్తు సిబ్బందికి సహకరించాలన్నారు.
-
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జగిత్యాల: చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జగిత్యాల విజయపురి కాలనీకి చెందిన అంకం కృష్ణవేణి(28) ఈనెల 3న రాత్రి సమయంలో భవనం నుంచి పడి గాయపడ్డారు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు శనివారం పట్టణ ఎస్సై కె. కుమారస్వామి కేసు నమోదు చేశారు.
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
జగిత్యాల: జగిత్యాల టౌన్-2 పరిధిలోని ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు రాజీవ్ చౌక్, బైపాస్ రోడ్, ఎస్కేఎస్ఆర్ డిగ్రీ కళాశాల, విజయపురి, విద్యానగర్, మైసమ్మగడ్డ, గొల్లపల్లి రోడ్, రఘురాములకోట, అశోకనగర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో సరఫరా ఉందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
-
విద్యుత్తు వినియోగదారులకు గమనిక..
కరీంనగర్: కరీంనగర్ గ్రామీణ మండలంలోని పలు గ్రామాలకు ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. విద్యుత్తు. లైన్ మరమ్మతు పనుల్లో భాగంగా ఉదయం 8.30 నుంచి 11. 30 గంటల వరకు ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, మొగ్గుంపూర్, రెర్లబూత్కూర్ గ్రామాలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. విద్యుత్తు వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
జనగామ: జనగామలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని లైన్‌మెన్ ఉదయ్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు పట్టణంలోని బాలాజీనగర్, ఎల్లమ్మగుడి, జ్యోతినగర్, జీఎంఆర్ కాలనీ, కలెక్టరేట్, సూర్యాపేట రోడ్డు, సెయింట్మేరీస్ స్కూల్, తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్తు సిబ్బందికి సహకరించాలన్నారు.