సిద్దిపేట: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతిపై, హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. 750 కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించాలని గుర్తు చేశారు. కోట శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Author: Shivaganesh
-
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఆర్ధిక ప్రోత్సాహక పథకంలో భాగంగా రుణాలు అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి డి. ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 14 నుంచి 31 వరకు tgobmms.cgg.ov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
మెదక్: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలైన ఘటన శనివారం చిన్నగొట్టిముక్ల విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. శివంపేట మండలం రత్నాపూర్‌కు చెందిన ఆంజనేయులు, శకుంతల దంపతులు హైదరాబాదులో కూలిపని కోసం తెల్లవారుజామున బైక్‌పై వెళ్తున్నారు. ఈక్రమంలో ఉపకేంద్రం సమీపంలో రోడ్డుపై అడవిపంది కలేబరాన్ని గమనించక ప్రమాదవశాత్తు ఢీకొనగా, శకుంతలకు కిందపడి తీవ్రగాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు భర్త తెలిపారు.
-
అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫులే (ఎంజేపీ) బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ ప్రాంతీయ సమన్వయ అధికారి రాజుకుమార్ తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, హెచ్పీటీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9989603070, 8985638218, 7989949221, 9989991703, 9154102621, 9052888229 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
-
రేపు జలాశయం నుంచి సాగునీటి విడుదల
భద్రాద్రి కొత్తగూడెం: తాలిపేరు జలాశయం నుంచి ప్రధాన కాల్వల ద్వారా సోమవారం పంట పొలాలకు సాగునీటిని విడుదల చేస్తామని కార్యనిర్వాహక ఇంజినీరు ఎస్ఏ జానీ తెలిపారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం ఉందని, ప్రధాన కాల్వల హెడ్ స్లూయిస్ నుంచి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జలాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు.
-
నేడు రాష్ట్రస్థాయి యోగా సదస్సు
ఖమ్మం: యోగా సాధకుల రాష్ట్ర స్థాయి సదస్సు జిల్లా కేంద్రంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వ హిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు మారికంటి వెంకట్ తెలిపారు. విద్యాలయాల్లో యోగా ప్రాధాన్యం, యోగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు అంశాలపై చర్చించడానికి రాష్ట్రంలోని 200మంది యోగా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
-
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
సిద్దిపేట: రాష్ట్ర మంత్రివర్గం 42శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపడంతో హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ధన్యవాలు తెలిపి వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, నాయకులు పాల్గొన్నారు.
-
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
జనగామ: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో చోటుచేసుకొంది. నియోజకవర్గ కేంద్రంలోని భారత్ బంక్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన ఘటన ఖమ్మం నయాబజార్ కళాశాల ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న వివేకవర్ధన్ ఉదయం తెల్దారుపల్లిలోని ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం కాల్వొడ్డుకు వచ్చాడు. ఈక్రమంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఓవ్యాన్ ఢీకొని గాయపడ్డారు. ఆయనను స్థానికులు ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
మెదక్: శివ్వంపేట మండలం పిల్లుట్ల 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని తూప్రాన్ ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. ఉపకేంద్రంలో మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదన్నారు. ఆయా గ్రామాల ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.