Author: Shivaganesh

  • దరఖాస్తుల ఆహ్వానం

    వరంగల్: దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, పునరావాస పథకంలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణాల మంజూరు కోసం ఈనెల 14 నుంచి 31 వరకు అర్హులైన దివ్యాంగులు, టీజీఓబీఎంఎంఎస్. సీజీజీ, జీవోవీ. ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

     

  • నేడు నృత్య నాటక ప్రదర్శన

    హన్మకొండ: హన్మకొండ అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు బుద్ధుడితో ప్రయాణం (డా. బి. ఆర్. అంబే డ్కర్) తెలుగు నృత్య నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మల అంబేడ్కర్ తెలిపారు. ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

     

  • ‘పార్టీని బలోపేతం చేయాలి’


    సంగారెడ్డి: నారాయణఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

  • పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

    హన్మకొండ: గ్రేటర్ పరిధిలోని 49 వ డివిజన్ ప్రకాష్ రెడ్డి పేటలో రూ.99.70 లక్షలతో సైడ్ డ్రైనేజీ & అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఆర్టీసీ సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు నుంచి బోయి తండా వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులతో కలిసి ఆయన ఇల్లెందు నుంచి బోయితండా వరకు బస్సులో ప్రయాణించారు. మారుమూల గ్రామానికి బస్ సౌకర్యం కల్పించడంతో ఏజెన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘త్వరలో పాలేరు కాల్వకు నీరు విడుదల’

    ఖమ్మం: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పెద్ద కాల్వ (రెండవ జోన్) కు అతి త్వరలో సాగర్ నీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ జిల్లా ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఉదయం పాలేరు జలాశయాన్ని సందర్శించిన ఆయన, ఎన్ఎస్పీ కాల్వపై యూటీ పనులను పరిశీలించారు. ఈ నెల 20న కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశముందని వెల్లడించారు.

     

  • దీక్ష శిబిరానికి జనసేన మద్దతు

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండల కేంద్రంలో గ్రామస్థులు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం 13వ రోజుకు చేరింది. దీక్ష శిబిరానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బస్ స్టేషన్ ఆవరణలో వెంటనే పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంక్ నిర్మాణంపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు.

  • కలెక్టరేట్ ముందు విద్యార్థుల ధర్నా

    కరీంనగర్: కలెక్టరేట్ ముందు శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న నిరుపేద విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ప్లీజ్ రియంబర్స్మెంట్‌తో పాటు సంక్షేమ గురుకుల హాస్టల్‌ను మంజూరు చేయాలని అన్నారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • విద్యార్థికి ఘన సన్మానం

    కరీంనగర్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కరీంనగర్‌కు చెందిన పెద్ది పార్ధు పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా శనివారం ఆయనను లయన్స్ క్లబ్, సప్తగిరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు సన్మానించారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్, తదితరులు పాల్గొన్నారు.

  • ప్రభుత్వ కళాశాలలో గోరింటాకు పండుగ

    కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటోనామస్) కళాశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని “గోరింటాకు పండుగ”నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ.. మన సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గోరింటాకు పెట్టుకోవడం, పాటలు పాడడం, నృత్యాలు చేస్తూ, ఉత్సాహంగా గడిపారు.