Author: Shivaganesh

  • అగ్నివీర్ అభ్యర్థులకు ఉచిత మెడికల్ క్యాంపు

    పెద్దపల్లి: ఈ నెల 14న అగ్నివీర్ SSCGD అభ్యర్థులకు PDPL ప్రభుత్వ ITIలో ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అగ్నివీర్ SSCGD అభ్యర్థులకు ఈ నెల 14న 18 రకాల మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8886304040, 9573688952  సంప్రదించాలని సూచించారు.

  • ఇసుక ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు

    కరీంనగర్: నగునూరులో అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నగునూరు వద్ద బత్తుల వీరయ్య అనే ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని, కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

  • రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి నియామకం

    వరంగల్: రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కోలా శివరామకృష్ణ నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయనకు జిల్లా అధ్యక్షుడు మడిపల్లి నాగరాజు నియామక పత్రం అందజేశారు. అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ.. తనను గుర్తించి బాధ్యత అప్పగించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు.

  • ఇండ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే

    వరంగల్: గ్రేటర్ వరంగల్లోని 11, 29వ డివిజన్లలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  • ‘కార్మికులను గౌరవించాల్సిన బాధ్యత అందరిది’

    వరంగల్: గ్రేటర్ పరిధిలోని 57వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి సుధాకర్ రెడ్డి పీపీఈ కిట్లను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వరంగల్ మహా నగరం శుభ్రంగా ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాషా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

  • 21 మంది భూభారతి ఆపరేటర్లు బదిలీ

    ఖమ్మం: జిల్లాలోని పలు మండలాల్లో పనిచేస్తున్న 21 మంది భూభారతి కంప్యూటర్ ఆపరేటర్లను కలెక్టర్ అనుదీప్ బదిలీ చేశారు. బదిలీ అయిన ఆపరేటర్లు తక్షణమే కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏన్కూరు, తల్లాడ, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, కొనిజర్ల, చింతకాని, బోనకల్, తదితర మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లు కలెక్టరేట్ వర్గాలు పేర్కొన్నాయి.

     

  • నకిలీ మందులు సప్లయ్ చేస్తున్న డీలర్‌ అరెస్ట్

    కరీంనగర్: జిల్లా కేంద్రంలో నకిలీ మందులు సప్లయ్ చేస్తున్న డీలర్‌ను శనివారం డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ కేంద్రంగా డాక్టర్ స్ట్రీట్ సాయినగర్‌లో వేణు మెడికల్ ఏజెన్సీస్ డీలర్ అర్.వేణుగోపాల్ నకిలీ మందులు విక్రయాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆయనను అరెస్ట్ చేసి, సన్ ఫార్మా లాబొరేటరీస్ పేరుతో నకిలీ డ్రగ్ లెవిపిల్ 500 టాబ్లెట్ సీజ్ చేసినట్లు తెలిపారు.

     

  • జగిత్యాలలో 70 వాహనాలు సీజ్..

    జగిత్యాల: జగిత్యాల పట్టణంలో టౌన్ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేష్‌లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా నెంబర్ ప్లేట్, బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, సీజ్ చేసి, చలాన్లు విధించినట్లు సీఐ తెలిపారు. అనంతరం వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

  • యూరియా ట్రాక్టర్‌ను పట్టుకున్న గ్రామస్థులు..

    వరంగల్: రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను గ్రామస్థులు పట్టుకున్న ఘటన నల్లబెల్లిలో వెలుగుచూసింది. నల్లబెల్లి గ్రామ సొసైటీ గోదాం నుంచి గురువారం రాత్రి 12-30 గంటలకు ట్రాక్టర్లో 15 బస్తాల యూరియాను ఆక్రమంగా తరలిస్తున్నారు. గ్రామస్థులు మామిడాల శంకరయ్య, కాగితాలశ్రావణ్, మామిడాలనవీన్, గాదెమల్లారెడ్డి ట్రాక్టర్‌ను పట్టుకుని సంగెం పోలీస్ స్టేషను తరలించారు. ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని ఏఓ యాకయ్య, ఎస్సై నరేశ్ తెలిపారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    ఖమ్మం: ఖమ్మం మండలం వెలుగుమట్లలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యూఆర్ఎస్) లో నైట్ వాచ్మెన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ శైలజలక్ష్మి తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు యూఆర్ఎస్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వెలుగుమట్లలోని కేజీబీవీలో హెడ్ కుక్ పోస్టుకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.