జనగామ: ఆస్పత్రిలో పాము కలకలం రేపిన ఘటన శుక్రవారం స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగుచూసింది. ప్రభుత్వాసుపత్రిలో అన్నం తింటున్న రోగులు పాము చూసి ఒక్కసారిగా ఆందోళనకి గురై సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది పాములు పట్టే రమణ సాయంతో సుమారు 30 నిమిషాలు పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. దీంతో సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
Author: Shivaganesh
-
కాల్వలో పడి రైతు మృతి
కరీంనగర్: ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఓరైతు మృతి చెందిన ఘటన శుక్రవారం ఓదెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గుంపులకు చెందిన రైతు దాసరి మురళి(50) తన పొలం వద్దకు సైకిల్‌పై విద్యుత్తు మోటారును తీసుకెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పోచమ్మకుంట మూలమలుపు ఆయకట్టు రోడ్డు పక్కన నీటికాల్వలో ప్రమాదవశాత్తు పడి ఊపిరాడక మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
ప్రసన్నాంజనేయుడికి ప్రత్యేక పూజలు
మెదక్: నరసాపూర్ బస్టాండ్ ఆవరణలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాడమాసం శనివారం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. స్వామివారికి నవగ్రహ పూజ, తమలపాకుల హారం వేసి సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
-
విద్యుత్తు వినియోగదారులకు గమనిక..
కరీంనగర్: రేకుర్తి, కొత్తపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కొత్తపల్లి, రాణిపురం, రేకుర్తి ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలన్నారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
కరీంనగర్: భగత్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నామని నగర రెండో ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు పద్మనగర్ పారమిత పాఠశాల, రాంనగర్, మార్క్ ఫెడ్ ప్రాంతం, మంక మ్మతోట, రాజీవ్ పార్కు, లేబర్ అడ్డా ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
తల్లి ఫిర్యాదు.. పిల్లలపై కేసు నమోదు
పెద్దపల్లి: నవమాసాలు మోసి, కనిపెంచి, పెద్ద చేస్తే వృద్ధాప్యంతో బాధపడుతున్న తనను పట్టించుకోవడం లేదని ఓ తల్లి ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన పెద్దపల్లిలో వెలుగుచూసింది. పెద్దపల్లిలోని ప్రగతినగర్కు చెందిన బండి పద్మకు చెందిన ఆస్తిని కూతురు, కుమారుడు తీసుకొని ఆమె ఆలనాపాలన చూడకపోవడంతో బాధితురాలు ఫిర్యాదు చేశారు. కుమార్తె చంద్రకళ, కుమారుడు నరేందర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
కరీంనగర్: ఆముదాలపల్లి, మొలంగూర్ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రఘు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొలంగూర్, చింతలపల్లి, మొలంగూర్ ఇండస్ట్రీయల్ ఏరియా, నల్లవెంకయ్యపల్లి, గూడాటిపల్లి, ఆముదాలపల్లి, రాజాపూర్, మెట్పల్లి గ్రామాలలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్తు వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
‘ప్రతి ఒక్కరూ సహకరించాలి’
మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరామ్, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచటంతో పాటు, సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు, సహకరించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు’
మెదక్: కూల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్‌ను జడ్పీ సీఈఓ ఎల్లయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 1200 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉందని, ఈ ఏడాది 2500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ వివరించారు.
-
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మానకొండూర్ తాగునీటి ట్యాంకు సమీపంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన అనిల్(20) ఇటీవల మానకొండూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. శుక్రవారం తాగునీటి కోసం బైక్‌పై వెళ్లి వస్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్‌ను స్థానికులు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.