Author: Shivaganesh

  • చికిత్స పొందుతూ ఒకరి మృతి

    వరంగల్: చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందిన ఘటన పర్వతగిరి మండలం కొంకపాకలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పత్తం ప్రభాకర్(27) కొంతకాలంగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులుపడుతూ జూన్ 12 గడ్డి మందు తాగారు. ఆత్మహత్యకు యత్నించినట్లు ఫోన్‌లో తండ్రి సమ్మయ్యకు చెప్పడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈక్రమంలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

  • విద్యుదాఘాతంతో రైతు మృతి

    ఖమ్మం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం వేంసూరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు చల్లగుండ్ల నాగార్జునరావు(58)  ఉదయం 9 గంటల సమయంలో పొలంలో ట్రాక్టరు దుక్కిదున్నిస్తున్నారు. ట్రాక్టరుకు పడిఉన్న విద్యుత్తు సర్వీసు తీగ అడ్డం వస్తుందని పక్కకు వేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • మూడు నెలల వేతనాలు విడుదల

    మెదక్: జిల్లాలోని 465 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 1535 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు (MPW) మూడు నెలల పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రూ.4.34 కోట్లు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యాయని, వెంటనే మల్టీ పర్పస్ వర్కర్లకు జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

     

  • విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

    మెదక్: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ మోసాలు, పరిష్కారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్బీఐ సీ.జీ.ఎం సింగల సుబ్బయ్య పాల్గొని మాట్లాడుతూ..  డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన మోసాల విషయంలో పరిష్కరించడానికి RBI రూపొందించిన గొప్పపథకం అంబుడ్సమెన్ పథకం అని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘ఈ యంత్రం కూలీల కొరతను తగ్గిస్తుంది’

    మెదక్: రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో చేతితో నడిచే విత్తనం, ఎరువులు వేసే యంత్రంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కూలీల కొరతను తగ్గించడంతోపాటు, విత్తనాలు, ఎరువులను సరైన దూరంలో వేయడానికి ఈ యంత్రం తోడ్పడుతుందని ఇన్‌ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. మొక్కల పెరుగుదల, పంట దిగుబడికి ఇది లాభదాయకం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

  • ‘నాణ్యమైన వైద్యం అందించాలి’

    మెదక్: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను శుక్రవారం DCHS శివదయాల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి, మందుల నిల్వలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.

  • 0009 నంబర్‌కు భారీగా పలికిన ధర

    వరంగల్: వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నంబర్ల ఆన్‌లైన్ వేలంలో 0009 నంబరు రూ.5,72,999 ధర పలికింది. ఈ నంబరుకు రవాణాశాఖ నిర్ణయించిన ధర రూ.50 వేలు. ఈ నంబరు కావాలంటూ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితాపటేల్, మరొకరు దరఖాస్తు చేసుకోగా వారికి ఆన్‌లైన్లో రహస్య వేలం నిర్వహించారు. రూ.5,72,999కు సుస్మితాపటేల్ ఈ నంబర్‌ను దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

    మెదక్: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కోసం జిల్లాలోని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 లోగా http://nationalaward-stoteachers.education.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    కరీంనగర్: హుజూరాబాద్ విద్యుత్తు సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరాలో శనివారం అంతరాయం ఏర్పడుతుందని అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీంతో పట్టణంలో శనివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్తు వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

  • ‘వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితం చేద్దాం’

    వరంగల్: బల్దియా ప్రధాన కార్యా లయంలో శుక్రవారం వ్యాపారులు, కాలనీ కమిటీల ప్రతినిధులతో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారులు సహకరించాలని కోరారు. వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితం చేద్దామని పిలుపునిచ్చారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ సంచులువాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.