Author: Shivaganesh

  • మనస్తాపంతో యువతి ఆత్మహత్య..

    భద్రాద్రి కొత్తగూడెం: మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం దమ్మపేట మండలం గండుగులపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కురసం వెంకటరమణ చదువుపూర్తి చేసుకొని ఇంట్లో ఖాళీగా ఉంటుంది. ఈక్రమంలో తనకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసినట్లు దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి  తెలిపారు.

  • రేపు పెద్దమ్మతల్లి బోనాలు

    సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హమాలీ కాలనీలో శనివారం బోనాల పండుగ నిర్వహించనున్నట్లు పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు బోనాల ఊరేగింపు ఉంటుందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదలు పొందాలన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

  • ఉచితంగా స్కూల్ బ్యాగులు అందజేత

    సిద్దిపేట: హుస్నాబాద్‌లోని మానసిక వికలాంగుల పాఠశాల (భవిత సెంటర్ )లో శుక్రవారం సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

    హన్మకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 4వ డివిజన్ జ్యోతిబసు నగర్లో శుక్రవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అక్షర కాలనీ నుంచి ప్రధాన రోడ్డు వరకు రూ.49.90 లతో రోడ్డు నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో భాగంగా డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

  • ‘భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి’

    మెదక్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌ను శుక్రవారం పలువురు  నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయనతో వారు కేక్ కటింగ్ చేయించారు. అనంతరం ఆయనను సన్మానించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, భరత్, తదితరులు పాల్గొన్నారు.

  • చికిత్స పొందుతూ ఆదివాసీ రైతు మృతి

    ములుగు: ఈనెల 4న ముకునూరుపాలెం గుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి సోయం కామయ్య అనే ఆదివాసీ రైతు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. దురుబొంగుల కోసం అడవిలోకి ఒంటరిగా వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు ప్రెజర్ బాంబుపై కాలు వేయడంతో అది పేలి తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

     

  • ఉచిత శిక్షణకు 13న పరీక్ష

    హన్మకొండ: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్న వారికి ఈనెల 13న పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం గౌరవ సంచాలకులు కె.జగన్మోహన్ తెలిపారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా ఎంపికచేసి ఉచిత శిక్షణ, వసతి, భోజనం అందిస్తారని తెలిపారు.

  • హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

    వరంగల్: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్ర-26కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు సర్వర్ మొహియొద్దీన్‌ఘాజీ తెలిపారు. ఈనెల 31వరకు దరఖాస్తులకు గడువు ఉందని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముస్లింలు హజ్ కమిటీ.జీఓ వీ.ఇన్ లేదా హజ్ సువిధ మొబైల్ యాప్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9704449236 నంబర్ సంప్రదించాలని అన్నారు.

  • నీరు విడుదల చేసిన అధికారులు

    ఖమ్మం: కూసుమంచి మండలం పాలేరు పాత కాల్వకు నీటిపారుదల శాఖ అధికారి మంగళపూడి వెంకటేశ్వర్లు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద చెరకు పంటలు ఎండిపోతున్నాయని, అలాగే వరినార్లు పోసుకునేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవించగా, ఆయన నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.

  • శాకంబరి అమ్మవారిగా భద్రకాళి

    హన్మకొండ: భద్రకాళి అమ్మవారు భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు శేషు మాట్లాడుతూ.. శాకంబరిని దర్శిస్తే అంతులేని కోరికలు తీరడంతో పాటు అన్న పానామృత ఫలములు పొందుతారని తెలిపారు. తల్లి నీలవర్ణం కలిగి కమలాసనముపై ఆసీనులై.. తన చేతుల్లో వరి మొలకలు, ఫలపుష్పాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలగు కూరగాయలు ధరించి ఉంటుందని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.