Author: Shivaganesh

  • ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

    సంగారెడ్డి: కంగ్టిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఏఈవో స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏడీఏ నూతన్ కుమార్  తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రతి రైతు తప్పనిసరి చేసుకోవాలని అన్నారు. కేంద్ర పథకాలు పొందాలంటే తప్పనిసరిగా 11 అంకెలతో కూడిన ఫార్మర్ ఐడి ఉండాలని అవగాహన కల్పించారు.

     

  • ‘నాణ్యమైన ఎరువులు విక్రయించాలి’

    సంగారెడ్డి: కంగ్టి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని శుక్రవారం ఏడీఏ నూతన్ కుమార్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులు విక్రయించాలని అన్నారు. ఎరువులు అమ్మితే రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని, రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని సూచించారు. ఎరువులు అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేత

    మెదక్: మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని శుక్రవారం మెదక్ పట్టణ ముదిరాజ్ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి బోనాల మహోత్సవం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈసందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిర్వహించనున్న నల్ల పోచమ్మ బోనాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షులు సున్నం.నరేష్, తదితరులు పాల్గొన్నారు.

  • నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

    మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన నల్ల పోచమ్మ దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

  • రోడ్డు సమస్యను పరిష్కరించరూ..

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి కోమటిపల్లి తండావాసులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. శుక్రవారం పలువురు మాట్లాడుతూ.. కోమటిపల్లి నుంచి తండాకు వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర కంకరలో  నడుచుకుంటూ వెళ్లలేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బడికి వెళ్లే చిన్నారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.

  • చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు

    సంగెం: చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. సంగెం మండలంలోని కాట్రపల్లి వడ్డెరగూడేనికి చెందిన అల్లెపు లక్ష్మి, కుమార్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, వారు పనులు ప్రారంభించారు. అల్లెపు జంపయ్య అనే వ్యక్తి వచ్చి వారిగోడను కూలగొట్టి, దుర్భాషలాడి, వారి కుమారుడిని చంపుతానని బెదించాడు. బాధితురాల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

  • మొక్కలు నాటిన డీఈఓ

    మెదక్: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఈఓ రాధాకిషన్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి విద్యార్థులు మొక్కలు నాటాలని, వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • పురుగుల మందుతాగి తల్లికుమార్తెల ఆత్మహత్య

    సిద్దిపేట: పురుగుల మందు తల్లికుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వర్గల్ మండలం గౌరారం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెల్దుర్తి భారతమ్మ (65), ఆమె కుమార్తె కవిత (26) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్

    సిద్దిపేట: హుస్నాబాద్‌లో 100 రోజుల కార్యచరణలో భాగంగా శుక్రవారం పురపాలక సంఘం కమిషనర్ టి.మల్లికార్జున్ ఆధ్వర్యంలో 20వ వార్డులో డ్రైనేజీల వద్ద స్ప్రేయింగ్, బ్లీచింగ్ చేశారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసర ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

  • కిన్నెరసాని ప్రాజెక్టు సమాచారం..

    భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 407.00 అడుగులకు ప్రస్తుతం 398.30 అడుగులు ఉన్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 100 క్రూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల నిలిపివేసిన అధికారులు పేర్కొన్నారు.