Author: Shivaganesh

  • గోదావరి నీటిమట్టం పెరుగుదల.. అప్రమత్తమైన అధికారులు

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న ఉపనదుల నుంచి గోదావరికి వరద నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 34 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నట్లు వెల్లడించారు. నేటి సాయంత్రానికి 40 అడుగులకు చేరే అవకాశం ఉందన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్, ఐటీడీఏ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

  • వన మహోత్సవంలో పాల్గొన్న పోలీసులు

    మెదక్: చిన్న శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వన మహోత్సవంలో పోలీసులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఎండిపోకుండా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ బాధ్యతగా వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘డిసెంబర్‌లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు’

    మెదక్: జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7 -9 తేదీల్లో మెదక్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19న జిల్లా కేంద్రంలో ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • వైభవంగా పోచమ్మ బోనాలు

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు మధ్య ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేధ్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. నేడు వనభోజనాలకు వెళ్లనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

  • దూరం కష్టమనిపించినా.. బాగా చదువుకుంటాం

    మెదక్: మెదక్ మండలం రాయలమడుగుకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచవరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతుకుంటున్నారు. వారు ప్రతిరోజు సైకిల్‌పై పాఠశాలలకు వెళ్లి వస్తుంటారు. ఈసందర్భంగా పలు విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలకు వెళ్లే దూరం కష్టమనిపించినా బాగా చదువుకొవాలనే ఆలోచనతో వెళ్లివస్తున్నట్లు తెలిపారు. బాగా చదువుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  • ‘మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు ఉండాలి’

    మెదక్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈ ప్యాకెట్స్ సొల్యూషన్స్ ఈవో వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నేడు మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హుస్సేన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో వయోవృద్ధుల సేవలందించేందుకు మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ల నిర్వహణకు స్వచ్చంద సంస్థలు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు. ఈనెల 15 వరకు వరకు జిల్లా సంక్షేమ కార్యాలయంలో వయోవృద్ధులు, బాల సంరక్షణ సేవా కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేయాలని సూచించారు.

  • ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం

    జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం ఉందన్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 8,19,500 క్యూసెక్సులని వెల్లడించారు. 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజ్ 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

     

  • భూవివాదంపై తహసీల్దార్ విచారణ

    మెదక్: రామాయంపేటలో బీడీ కార్మికులకు కేటాయించిన భూమిని (సర్వే నంబర్ 1597) శీలం సుభాష్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఫిర్యాదులపై తహసీల్దార్ రజనీ కుమారి స్పందించారు. ఈసందర్భంగా ఆమె క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేశాక బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

  • పెరుగుతున్న గోదావరి వరద

    ములుగు: వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. పేరూరు వద్ద శుక్రవారం ఉదయం గోదావరి నీటిమట్టం 14 :800 మీటర్లకు చేరుకుందన్నారు. పూసూరు బ్రిడ్జి వద్ద పరవళ్లు తొక్కుతూ  గోదావరి కనిపిస్తోందని స్థానికులు తెలిపారు.