Author: Shivaganesh

  • దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 7వ వార్డుల్లో దోమల మందు పాగింగ్ చేశారు. అనంతరం దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘ఆపరేషన్ ముస్కాన్‌లో ఎనిమిది కేసులు నమోదు’

    మెదక్: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • జాతీయ వర్క్‌షాప్‌కు హాజరైన కలెక్టర్

    మెదక్: ఢిల్లీలో జరిగిన ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (చిన్ననాటి విద్య) పై జరిగిన జాతీయ వర్క్‌షాప్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా కలెక్టర్ రాహుల్‌రాజ్  హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన తెలంగాణ తరపున మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన్‌తో కలిసి హాజరై.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పిల్లలకు ప్రాథమిక శిక్షణ, కొత్త యూనిఫామ్‌లు వంటి పోషణ కార్యక్రమాలను వివరించారు.

  • ముగిసిన లీగల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్

    మెదక్: జిల్లాలో ప్లాన్ ఇండియా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఆరు రోజుల చైల్డ్ ప్రొటెక్షన్, లీగల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ గురువారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విజయవంతంగా ముగిసింది. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మెదక్, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, నర్సాపూర్, రామాయంపేట మండలాల్లోని పాఠశాలలు, గ్రామాల్లో పిల్లల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

  • విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి

    భద్రాద్రి కొత్తగూడెం: విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి చెందిన ఘటన గురువారం సుబ్బంపేటలో  వెలుగుచూసింది. గ్రామంలోని ఓఇంట్లో కణితి శాంతమూర్తి(30) వాల్ కటింగ్ మిషన్‌తో గోడకురంద్రాలు చేస్తుండగా యంత్రానికి విద్యుత్తుప్రసరించడంతో అక్కడికక్కడే పడిపోయాడు. అతడిని రక్షించేందుకు యజమానురాలు సామ్రాజ్యం ప్రయత్నించగా ఆమెకూడా విద్యుదాఘానికి గురైంది. స్థానికులు గమనించి వారిని కొయ్యూరు పీహెచ్సీకి తరలించగా, శాంతమూర్తి చనిపోయాడని, సామ్రాజ్యం పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.

  • నానో యూరియా వాడకంపై శిక్షణ

    మెదక్: హవేళిఘన్పూర్ రైతు వేదికలో నానో యూరియా, నానో DAP వాడకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, సొసైటీ CEOలకు శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి విన్సెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..  నానో యూరియా వల్ల తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఇండ్ల పేరుతో మొరం దందా..

    వరంగల్: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సంగెం మండలంలో మొరం దందా నడుస్తుందని స్థానికులు వాపోయారు. అక్రమ మట్టి వ్యాపారులు నెలరోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. వారికి అధికార పార్టీ స్థానిక నాయకులు తోడై లబ్ధిదారులను దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను కట్టడి చేయాలని ప్రజలు కోరారు.

     

  • దరఖాస్తుల ఆహ్వానం

    వరంగల్: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జులై 2025 సెషన్‌కు సంబంధించిన నూతన ప్రవేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రాంతీయ సంచాలకుడు డా.బోళ్ల రాజు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • శ్రీ చైతన్య పాఠశాలకు షోకాజ్ నోటీసులు

    మెదక్: తూప్రాన్ జాతీయ రహదారి సమీపంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి డా.పర్వతి సత్యనారాయణ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో 9వ తరగతి నిర్వహిస్తున్నట్లు, పాఠశాల ఆవరణలో యూనిఫాం విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.

  • మంత్రి పొన్నంకు వినతి అందజేత

    సిద్దిపేట: హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేయాలని  మంత్రిని కోరినట్లు తెలిపారు.
    కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, పలువు సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.