మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘ప్రశ్నించడం ఆపకూడదు’
మెదక్: సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, హనుమంతరావును ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడు చిట్టిమల్లి నరేందర్ రెడ్డి, మీడియా వారియర్ శ్రీకాంత్ సాగర్‌పై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బుధవారం స్పందించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని, ప్రశ్నించడం ఆపకూడదని భరోసా ఇచ్చారు.
-
కొత్తగూడలో సీతక్క జన్మదిన వేడుకలు
మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొని కేక్‌కట్ చేసి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీతక్క ప్రతిపక్షంలో, అధికారంలో అణగారిన ప్రజలకు సంక్షేమ కోసమే పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
సదాశివపేటలో సీఐటీయూ ర్యాలీ
సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలో బుధవారం కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడాన్ని తీవ్రంగా నిరసించారు. ర్యాలీలో సంఘం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
-
‘విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతాం’
మెదక్: రామాయంపేటలో బుధవారం ఏబీవీపీ 77వ ఆవిర్భావ, జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని, విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
ఇల్లెందులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందులో బుధవారం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రధాన సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ,ఐఎన్టియూసీ, ఇఫ్టూ, టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
-
ఉగ్రవాదుల లింక్స్.. మరిపెడ మండలంలో NIA సోదాలు
మహబూబాబాద్: మరిపెడ మండలంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. మండలంలోని భూక్య తండాలో బుధవారం ఎన్ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఇక్కడి రైతు దగ్గర మహారాష్ట్రకు చెందిన వ్యక్తి జిలెటిన్ స్టిక్స్ (పేలుడు పదార్థాలు) కొనుగోలు చేసి, తీవ్రవాదులకు అమ్ముతున్నట్లు NIA అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టడం జిల్లాలో హాట్‌టాపిక్ అయింది.
-
‘నాణ్యమైన విద్యాబోధన చేయాలి’
సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ దశరథ్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మండల కేంద్రంలోని రోడ్ల మరమ్మతులు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాఠశాలలో సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈసందర్భంగా విద్యాబోధనను దగ్గరుండి పరిశీలించి, నాణ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిన మహేష్
మెదక్: దోమకొండలో జరిగిన ఇంటర్నేషనల్ ఓకినవా గోజురియు కరాటే ప్రోగ్రాంలో తిప్పనగుల్ల గ్రామానికి చెందిన కొంతం మహేష్ బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈసందర్భంగా ఆయన గ్రాండ్ మాస్టర్లు కమిండ్ల రాజయ్య, కమిండ్ల నవీన్, మాస్టర్ పోచమ్మల రామకృష్ణ చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్‌ను అందుకున్నారు. విజయం సాధించిన తన విద్యార్థిని మాస్టర్ రామకృష్ణ అభినందనలు తెలిపారు.
-
నిరసన తెలిపిన అర్చకులు
ఖమ్మం: భద్రాచలం దేవస్థాన ఈవో రమాదేవిపై జరిగిన దాడి నిరసిస్తూ బుధవారం నేలకొండపల్లి అర్చకులు, సిబ్బంది నిరసన చేపట్టారు. ఈసందర్భంగా మండల పరిధిలోని పలు దేవాలయాల్లో అర్చకులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అర్చకుల సంఘం నాయకుడు ఎస్.రమేష్ మాట్లాడుతూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.