Author: Shivaganesh

  • రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య

    ఖమ్మం: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మధిరలో వెలుగుచూసింది. మధిర మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పని చేస్తున్న అనిల్ (30) స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

     

  • ఈనెల 15న జిల్లా స్థాయి ‘కామిక్ రచన’ పోటీలు

    భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా స్థాయి ‘కామిక్ రచన పోటీలను ఈనెల 15 నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీలల్లో 6-10వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చునని చెప్పారు. పోటీలు పాత కొత్తగూడెం ఆనందఖని జిల్లా విద్య శిక్షణ కేంద్రంలో ఉంటాయని అన్నారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఇతర వివరాలకు ఏఎంఓ నాగరాజశేఖర్‌ను సంప్రదించాలని చెప్పారు.

  • గుమ్మడిదలలో 13న పోచమ్మ తల్లి బోనాలు

    సంగారెడ్డి: గుమ్మడిదల మండల కేంద్రంలో బుధవారం గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ విషయమై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 13న పోచమ్మ తల్లి బోనాలు, 15న ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • అశ్వారావుపేట ఎంపీడీఓ బదిలీ

    భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొందరు ఎంపీడీఓలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బి.అప్పారావు అశ్వారావుపేటకు రానున్నారు. ప్రవీణ్‌కుమార్ ఇల్లెందుకు బదిలీపై వెళ్లనున్నారు.

  • ‘ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

    జనగామ: స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నిరుద్యోగ యువతకు ఉచిత హాస్టల్, భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పిస్తున్నందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 994846611155 ఫోన్ నంబర్లకు  సంప్రదించాలన్నారు.

  • ‘కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి’

    భద్రాద్రి కొత్తగూడెం: పినపాక నియోజకవర్గంలో బుధవారం సింగరేణి, ఆర్టీసీ, మున్సిపాలిటీ, బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకు 10 గంటల పని సమయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

     

  • మేడిగడ్డ బ్యారేజ్‌కు కొనసాగుతున్న వరద

    జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు ప్రాణహిత వరద కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కారణంగా 85 గేట్లు ఎత్తినట్లు పేర్కొన్నారు. ఎగువ నుంచి వస్తున్న 1,26,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

  • కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల సమ్మె

    భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ బుధవారం సింగరేణి కార్మికులు 5 ఇంక్లైన్ గని వద్ద సమ్మె చేశారు. ఈసందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ.. ఈ లేబర్ కోడ్‌లు జీతాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులను హరిస్తాయని తెలిపారు. సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గనివద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

     

  • ఎక్కడి చెత్త అక్కడే..

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎక్కడికి చెత్త అక్కడే దర్శనమిచ్చింది. లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు కార్మికుల సార్వత్రిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ పరిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో ఉదయం వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

  • ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన

    హన్మకొండ: కమలాపూర్ మండలం హెచ్‌పీసీఎల్ ప్లాంట్ వద్ద బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా సంఘం నాయకులు జక్కు రాజు గౌడ్, శనిగరపు వంశి మాట్లాడుతూ.. పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని ఖండించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం నాయకులు పాల్గొన్నారు.