వరంగల్: వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసునమోదు చేసిన ఘటన సంగెం మండలంలో చోటుచేసుకుంది. ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ముప్పు జనార్దన్ కొద్దిరోజులుగా సంగెం మండలం గవిచర్లలోని తన అత్తగారింట్లో ఉంటున్నారు. ఈక్రమంలో ఆయన సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Author: Shivaganesh
-
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం: పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ఎంపికకు అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థల నుంచి 2025-26 సంవత్సరానికిగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడబ్ల్యూఓ కె.రామ్‌గోపాల్ రెడ్డి తెలిపారు. ఐదేళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు, బాలల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన స్వచ్ఛంద సంస్థలు ఏడేళ్ల అర్హత ఉన్న వారికే అవకాశం ఉంటుందని చెప్పారు. వెబ్ సైట్ http:awards. gov.in లో ఈనెల 31లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
-
ముకుందాపురంలో వైఎస్సార్‌కు ఘన నివాళి
సూర్యాపేట: మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో మంగళవారం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వైఎస్సార్ సేవలను కొనియడారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
-
వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన సీతక్క
మహబూబాబాద్: కొత్తగూడ మండలంలో మంగళవారం మంత్రి సీతక్క పర్యటించారు. ఈసందర్భంగా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వేడుకల్లో ఆమె పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. వైఎస్సార్ జనహృదయ నేత అని అన్నారు. అనంతరం కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
-
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
నిర్మల్: జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బురాజ్ పాల్గొని 48 గంటల సాయిశంకీర్తనను ప్రారంభించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ ఛైర్మన్ కొండ్రు రాంరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
-
విద్యార్థులకు అవగాహన సదస్సు
మెదక్: నర్సాపూర్ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్లాన్ ఇండియా, షీ టీం, ఐసీడీఎస్ భరోసా టీంల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని బాల్య వివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, జనన నమోదు, టీకాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు హెల్ప్‌లైన్ నంబర్లు 1098, 15100, 100/112, 1930లను అందుబాటులో ఉంచారు.
-
నాగర్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుందని మంగళవారం అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 58,379 క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో 3,990 క్యూసెక్కులు ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 531.00 అడుగులని అన్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312,0450 కాగా ప్రస్తుత నీటి నిల్వ 170.1040 టీఎంసీలు ఉన్నట్టు తెలిపారు.
-
భద్రకాళికి ప్రత్యేక పూజలు
వరంగల్: శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఉదయాన్నే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
-
‘రేషన్ డీలర్ల సంక్షేమానికి కృషి చేస్తా’
వరంగల్: రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్‌కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుని, సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
-
ఉపాధి అవకాశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం: పోర్చుగల్లో ఉపాధి అవకాశాల కోసం ఆసక్తి గల నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఉపాధి అధికారిణి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు 21-40 ఏళ్ళు కలిగి ఉండి, 2 – 5 ఏళ్ల అనుభవం ఉండాలని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు, రెజ్యూమ్లను tomcom.resume@g.com సెండ్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 9440049937, 9440051452 3 నంబర్‌ను సంప్రదించాలన్నారు.