వరంగల్: కాల్వ బాట విషయంలో రైతులు ఘర్షణ పడిన ఘటన మంగళవారం పర్వతగిరిలో వెలుగుచూసింది. స్థానిక ఎస్సారెస్పీ కాల్వ బాట ఆక్రమణపై రైతులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల సమక్షంలో కాల్వకు ఇరువైపులా 6 అడుగుల బాటను తీసేందుకు రైతులు అంగీకరించడంతో వివాదం సమసిపోయింది.
Author: Shivaganesh
-
చెల్లని చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
హన్మకొండ: హుజూరాబాద్, కమలాపూర్ మండలాల్లో ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆ చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్లగా బ్యాంకు అధికారులు అవి చెల్లవని చెప్పడంతో లబ్ధిదారులు ఖంగుతిన్నారు. మంగళవారం పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. తమకు మూడు నెలల కాలపరిమితి ముగిసిన చెక్కులు అందజేశారని వాపోయారు. కాలపరిమితి ముగిసేవరకు చెక్కులు పంపిణీ చేయకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు ఆహ్వానం..
యాదాద్రి భువనగిరి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలకు ఆగస్టు 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కోఆర్డినేటర్ గంజి రమేష్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును ఆగస్టు 13 వరకు చివరి అవకాశంగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9000590545కు నంబర్ సంప్రదించాలని తెలిపారు.
-
నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి: కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ నవోదయ ప్రవేశాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026-27 విద్యా సంవత్సరానికి విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని పూర్తి వివరాలకు 9110782213, 7993269431 3 సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని డీఈఓను ఆదేశించారు.
-
బాలుడితో పని.. కేసు నమోదు
యాదాద్రి భువనగిరి: బాలుడితో పని చేయిస్తున్న ఘటనలో యజమానిపై కేసు నమోదు అయిన ఘటన సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రలో చోటుచేసుకుంది. లక్ష్మీ ఇకోపోమ్ కారు వాషింగ్ సెంటర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓబాలుడితో పని చేయిస్తున్నందుకు గాను యజమాని మల్లేపల్లి సురేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
-
రెండు రోజులు నీటి సరఫరా బంద్
యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలో రెండు రోజుల పాటు సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ రామలింగం తెలిపారు. నీటి సరఫరా ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా పట్టణంలో ఈనెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకుని సహకరించాలని కోరారు. మరమ్మతుల అనంతరం యాథావిధిగా సరఫరా సజావుగా సాగుతుందన్నారు.
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
హన్మకొండ: శాయంపేట సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వ్యాపా రులు, వినియోగదారులు విద్యుత్తు శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
‘ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి’
ఖమ్మం: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన సమస్యల ఫోటోలు తీసి పంపించాలన్నారు.
-
‘వరికి బదులుగా ఆయిల్ పాం సాగు చేయాలి’
నల్గొండ: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం మెగా ప్లాంటేషన్లో భాగంగా చెర్వుగట్టులోని బిల్లాల సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 17 ఎకరాల్లో పతాంజలి ఫుడ్స్, ఆయిల్‌పాం కంపెనీ భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి అనంతరెడ్డి పాల్గొన్నారు. రైతులు వరికి బదులుగా మూడురెట్లు అధిక దిగుబడి, ఆదాయమిచ్చే ఆయిల్‌పాం సాగు చేయాలని ఆయన సూచించారు.