నల్గొండ: నల్గొండలోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం సాయంత్రం జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరత లేదని, కావాల్సినంత ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 24 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. విక్రయాలకు సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, డీలర్ల వద్ద 9 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు.
Author: Shivaganesh
-
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: డా.బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.ధర్మారెడ్డి, కేంద్రం కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోడానికి అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.
-
పీహెచ్‌డీ పట్టా అందుకున్న కుమారస్వామి
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన 23వ స్నాతకోత్సవ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పుల్ల కుమారస్వామి తెలుగు సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు గ్రామస్థులు, స్థానికులు అభినందనలు తెలిపారు.
-
ఈనెల 11న ఉద్యోగ మేళా
హన్మకొండ: ఈనెల 11న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్, హన్మకొండ జిల్లా ఇంటర్ విద్యాధికారులు డా.శ్రీధరుమన్, ఎ.గోపాల్ తెలిపారు. 2024, 2025 సంవత్సరాల్లో ఇంటర్, వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జాబ్ మేళాకు అర్హులని చెప్పారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఐసీఎస్ఎస్ శిక్షణ కేంద్రంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు 7569177071 నంబరులో సంప్రదించాలని సూచించారు.
-
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం ధర్మారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మేడవేణి చిన్నయ్య (65) స్థానిక పెట్రోల్ బంక్‌కు పెట్రోల్ కోసం బైక్‌పై వచ్చి వెళ్తున్న క్రమంలో ఆయనను బొలెరో వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కొడుకు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.
-
‘పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పని చేస్తుంది’
మెదక్: హత్నూర మండలంలోని దౌల్తాబాద్‌లో సోమవారం వివిధ పరిశ్రమల వద్ద ఆటో ప్రచార జాత నిర్వహించారు. ఈసందర్భంగా జి.సాయిలు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్స్‌గా తెచ్చందన్నారు. పెట్టుబడిదారుల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ఈనెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు.
-
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
జనగామ: పాలకుర్తి మండలం ఎసల తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి కె. రాజేంద్ర కుమార్ పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్ణీకరణ కలను నిజం చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు.
-
జల ప్రసాదం పంపిణీ
మెదక్: నర్సాపూర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ గౌడి చెర్ల హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జల ప్రసాదం (తాగునీరు) పున: ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెలిమేటి సంజీవ, సదానందం, దేవగౌడ్, శ్రీనివాస్, సాయి, భక్తులు పాల్గొన్నారు.
-
ప్రారంభమైన గ్రేటర్ కౌన్సిల్ సమావేశం
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సోమవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. నగర మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ప్రారంభమైన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్, నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా రేనోవేషన్ చేసిన కౌన్సిల్ హాల్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి మేయర్ ప్రారంభించారు.
-
గవర్నర్‌ను కలిసిన వరంగల్ సీపీ
వరంగల్: కాజీపేట నిట్ కళాశాల అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను సోమవారం వరంగల్ సీపీ సన్ ప్రీత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయనకు సీపీ పుష్పగుచ్ఛం అందజేశారు. కేయూలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ జిల్లాకు వచ్చిన విషయం విదితమే. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసింగ్ పనితీరును గవర్నర్ సీపీని అడిగి తెలుకున్నారు.