Author: Shivaganesh

  • బొలెరో వాహనం ఢీకొని ఒకరి మృతి

    కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వీణవంక మండలం చల్లూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొలిపాక రాజయ్య వాకింగ్ కోసం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలో నాట్లు వేసే కూలీలతో బొలెరో వాహనం వెనుక నుంచి వచ్చి ప్రమాదవశాత్తు ఆయన్ను ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ‘ప్రజావాణి సమస్యలు సత్వరం పరిష్కరించాలి’

    నిజామాబాద్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్లియాన్ మావి, తదితరులు పాల్గొన్నారు.

     

  • ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

    రాజన్న సిరిసిల్ల: చెక్కపల్లి బస్టాండ్ ప్రాంగణంలో సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వర్గీకరణపై సుప్రీం తీర్పు వెలువడిన మరుక్షణమే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదం తెలిందన్నారు.

  • సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ఆయా కాలనీల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

  • వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మశాల వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు రాధాకృష్ణశర్మ, శివకుమార్ మాట్లాడుతూ.. స్వామివారికి రుద్ర నమక చమకాలతో అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    పెద్దపల్లి: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన కుంటశివ, కొత్తపల్లికి చెందిన ఎలాబోతరం శంకరయ్య, ఓదెల మండలం రూపునారాయణపేటకి చెందిన ఎడ్ల అర్చన్ కోవెల్‌లకు సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరయ్యారు. సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే విజయరమణరావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ గొప్పవరం అని అన్నారు.

     

  • సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

    సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం రుద్రారం పరిధిలోని గణేష్‌గడ్డ శ్రీసిద్ధి వినాయక దేవాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడతూ.. స్వామివారి గుడిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో వంటశాల, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

     

  • వినూత్న రీతిలో నిరసన

    కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో సోమవారం కాలనీవాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాలనీలోని  ప్రధాన రహదారిలో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అవస్థలు ఏర్పడటంతో కాలనీవాసులు నాట్లు వేసి వినూత్న నిరసన చేశారు. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.

  • కురవిలో మాజీ మంత్రి ప్రత్యేక పూజలు

    మహబూబాబాద్: మాజీమంత్రి సత్యవతిరాథోడ్ మోకాలి శస్త్రచికిత్స తర్వాత సోమవారం తొలిసారిగా కురవి ఆలయానికి వచ్చారు. ఈసందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ భద్రకాళీసమేత వీరభద్రస్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

     

  • గవర్నర్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

    వరంగల్: జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను సోమవారం వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.