Author: Shivaganesh

  • యూరియా కోసం బారులు తీరిన రైతులు

    వరంగల్: నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో సోమవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇస్తే సరిపోదు, కనీసం 4 బస్తాల యూరియా ఇవ్వాలని అన్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరికి యూరియా అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    రాజన్న సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో కమర్షియల్ గార్మెంట్, టెక్నాలజీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దర్శనాల పద్మ తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 7న కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు 9704550181ను సంప్రదించాలని సూచించారు.

  • చిత్రలేఖన పోటీలకు ఆహ్వానం

    సిద్దిపేట: సిద్దిపేటలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ(ఎన్సాన్పల్లి మార్గం) ఆధ్వర్యంలో చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు నహీం రుస్తుం తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 13వ తేదీలోపు ప్రకృతి రమణీయత, ప్రయాణ ప్రాంగణాలు ఎంచుకొని ఏదైనా ఒక చిత్రం వేసి అందించాలన్నారు. ఇంటర్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు పోటీలో పాల్గొనవచ్చన్నారు.

  • నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    సిద్దిపేట: వర్గల్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వాసుదేవరావు పేర్కొన్నారు. నాచారంలో 33 కేవీ విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా వేలూరు, సీతారాంపల్లి, అనంతగిరిపల్లి, నాచారం గ్రామాల్లో ఉదయం నుంచి 11.30 గంటల వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి, సహకరించాలన్నారు.

  • జుక్కల్లో బీజేవైఎం అధ్యక్షుడి ముందస్తు అరెస్ట్


    కామారెడ్డి: జుక్కల్ మండలంలో సోమవారం తెల్లవారుజామున బీజేపీ బీజేవైఎం అధ్యక్షుడు మారుతి ఆయిల్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన నేపథ్యంలో ముందుస్తు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అభివృద్ధి పనుల కోసం మంత్రి వస్తుంటే, ప్రశ్నించే గొంతులను అక్రమంగా అణచివేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.  ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాలను ఆపలేరన్నారు.

  • జూద శిబిరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

    కామారెడ్డి: జూద శిబిరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసిన ఘటన జుక్కల్ మండలంలోని హంగర్గలో వెలుగుచూసింది. గ్రామం పరిధిలోని బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈక్రమంలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ. వెయ్యి నగదు, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.

  • గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

    ములుగు: ప్రభుత్వ పథకాల నిర్లక్ష్యంపై ఏటూరునాగారం జిల్లా కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. గులాబీ శ్రేణులు చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేష్ మృతికి నిరసనగా ధర్నా తలపెట్టారు. ఈక్రమంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిని గృహ నిర్బంధం చేశారు.

  • విద్యార్థి సంఘం నాయకులు అరెస్ట్

    హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా వరంగల్ పర్యటనకు గవర్నర్ వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఉదయం పలు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాలను ఆపలేరన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘం నాయకులను పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

  • జిల్లాలో 27 మంది ఎస్సైల బదిలీ

    సిద్దిపేట: జిల్లాలో దీర్ఘకాలికంగా వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న 27 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఉత్తర్వులు జారీచేశారు.  బదిలీ అయిన వారిలో ఎస్సైలలో 21 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. కొంతమంది శిక్షణలో ఉన్న ఎస్సైలకు ఆయా స్టేషన్లలో పోస్టింగ్ ఇవ్వగా మరికొంత మందిని వివిధ విభాగాలకు బదిలీ చేశారు.

  • కోరుట్ల నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

    జగిత్యాల: ఈనెల 10న గురు పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలగిరికి కోరుట్ల నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసు ఏర్పాటు చేసినట్లు డీఎం మనోహర్ తెలిపారు. 8న సాయంత్రం 4 గంటలకు కోరుట్ల నుంచి బస్సు బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, 10న అరుణాచలం, 11న గద్వాలజోగులాంబ అమ్మవారిని దర్శించుకొని తిరిగి  కోరుట్లకు వస్తుందన్నారు. పూర్తి వివరాలకు 79892 35279, 9963961503, నంబర్లను సంప్రదించాలని కోరారు.