Author: Shivaganesh

  • అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

    మెదక్: అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య అంగన్‌వాడీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 14 అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. పలుచోట్ల చీకటి గదిలో కేంద్రాలను నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ప్రభుత్వం ప్లే స్కూల్ ఏర్పాటు చేసినప్పటికి సరైన వసతులు ఉండటం లేదన్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

  • నేడు జిల్లాలో రైతుమిత్ర కార్యక్రమం

    జగిత్యాల: జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లిలోని వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రైతుమిత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేసి సాగులో సలహాలు అందిస్తారని పేర్కొన్నారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

     

  • దరఖాస్తుల ఆహ్వానం

    జనగామ: ఖిలాషాపురం కస్తూర్బా గాంధీ, వెల్దిలోని మోడల్ స్కూల్ బాలికల అనుబంధ వసతి గృహాల్లో ఒప్పంద ప్రాతిపదికన వంట మనుషుల (కుక్) నియామకం చేయనున్నట్లు ప్రత్యేకాధికారి గంధమాల హేమలత తెలిపారు. సోమవారం సంబంధిత వసతి గృహాల్లో ఆసక్తి గల మహిళాలు ప్రధాన, సహాయ కుక్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • నేడు నీటి సరఫరాకు అంతరాయం

    సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సోమవారం తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. కరీంనగర్ దిగువ మానేరు జలాశయం నుంచి సరఫరా చేసే పైపులైన్ చిన్నకోడూరు, వెంకట్రావులపల్లి వద్ద లీకేజీలు ఏర్పడిన కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. మరమ్మతుల నేపథ్యంలో 18, 19, 20, 21, 36, 37 వార్డుల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు గమనించి సహకరించాలన్నారు.

  • విద్యుత్తు సరఫరాలో అంతరాయం 

    నిజామాబాద్: డిచ్‌పల్లి సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ గంగాధర్ చెప్పారు. సబ్ స్టేషన్‌లో రెండు కొత్త బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్న కారణంగా ఘన్పూర్, డిచ్పల్లి రైల్వే స్టేషన్, ఏడో బెటాలియన్, బీబీపూర్ తండా, రిలయన్స్ పీడర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

  • నేడు జుక్కల్లో పర్యటించనున్న మంత్రి

    కామారెడ్డి: జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. పిట్లం మద్దెలచెరువు- పిట్లం రోడ్డులోని తిమ్మానగర్ వద్ద రూ.4.86 కోట్లతో నిర్మించిన హై లెవెల్ వంతెనను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన బిచ్కుంద నుంచి డోంగ్లి వరకు రూ.13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తానన్నారు.

  • నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    వరంగల్: రంగశాయిపేట నరగంలోని వివిధ విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో శివాలయం పరిధిలో ఉదయం 11 – 1 వరకు కాశీబుగ్గ, శాంతినగర్, మదీనారోడ్, డాక్టర్ హరీరమాదేవి ఆస్పత్రి, కాశీబుగ్గ పరిధిలో మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

  • జాతీయ స్థాయి పోటీలకు చరణ్ ఎంపిక

    మెదక్: జాతీయస్థాయి రబ్బి పోటీలకు చిన్నశంకరంపేట మండలం వాసి ఎంపికయ్యారు. మండలంలోని ఖాజాపూర్‌ చెందిన విష్ణుశ్రీ చరణ్ ఎంపికైనట్లు జిల్లా రబ్బి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గణేష్ రవికుమార్, మల్లేశ్వరి తెలిపారు. ఈనెల 12, 14 తేదీల్లో దేహరాదున్‌లో జరిగే జాతీయ రబ్బి పోటీలో చరణ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా చరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

  • ‘అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి’

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిద్దిపేట రహదారి నుంచి మెదక్ చౌరస్తా వరకు ఆదివారం సాయంత్రం వీధిలైట్లు వెలగకపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసందర్భంగా పలువురు వాహనదారులు మాట్లాడుతూ.. ప్రతిరోజు వీధిలైట్లు వెలగటం లేదని చెప్పారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

  • నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

    కరీంనగర్: మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌లు సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ముందుగా వారు ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ స్టేడియాన్ని సందర్శిస్తారని, అనంతరం 10-30 గంటలకు వనమహోత్సవంలో పాల్గొంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. 11 గంటలకు ఉజ్వలపార్క్ సమీపంలోని చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పరిశీలించి మత్స్యకారుల సంఘాలతో సమావేశమవుతారన్నారు.